అక్షర

ప్రేమానుబంధాల ‘వేదిక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదిక
-కోసూరి ఉమాభారతి
వెల: 150 రూ.లు
లభించేచోటు అమెరికాలో వంగూరి ఫౌండేషన్,
ఇండియాలో నవోదయా
బుక్‌హౌస్,
ఆర్యసమాజ్, హైదరాబాద్ .
**
కోసూరి ఉమాభారతి ప్రముఖ నాట్య కళాకారిణి. ప్రస్తుతం ఈమె అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్నారు.
ఓ నృత్యకళాకారిణి జీవితాన్ని ఆవిష్కరించిన నవల ఈ వేదిక.. సరళమైన భాష, చక్కటి శిల్పం, చదివించే గుణం ఉన్న నవల.
ఇందులో కథానాయకి చంద్రకళ. ఆమె తండ్రి ఆర్మీ మేజర్ సత్యదేవ్, తల్లి శారద.. అమ్మవారిని పసుపుబట్టలతో పూజిస్తే పుట్టిన బిడ్డ చంద్రకళ. తల్లి శారద మంచి సంగీత కళాకారిణి. ఆమె ఎంతోమంది పిల్లలకి సంగీతం నేర్పిస్తుంటుంది. నవల మొత్తం ఉత్తమ పురుషలో సాగిపోతుంది. చంద్రకళని మంచి నాట్యకళాకారిణి చేయాలన్నది శారద ఆశయం. అందుకు తగ్గట్టే చిన్నప్పటినుంచీ నాట్యంపట్ల, సంగీతం పట్ల ఆసక్తిచూపిస్తూ తల్లి పాటలకి అనుగుణంగా బుల్లి, బుల్లి అడుగులువేస్తూ ఆనందిస్తూ ఉంటుంది. చంద్రకళకి ఒక తమ్ముడు వినోద్.. తల్లి, తండ్రిలకు చంద్రకళంటే అపురూపం. ఆమెలో దాగిఉన్న కళను, ఆ కళపట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తూ మంచి గురువు శివరామశర్మ దగ్గర ఆమెకి శిక్షణ ఇప్పిస్తారు శారద, సత్యదేవ్‌లు.
వీరి సన్నిహితులు భూషణ్, నీరూలు వారి కుమార్తె రాణి. రాణి మంచి గాయని. కాకపోతే ఒక్కతే కూతురవడం ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగడంతో రాణి పెంకిగా తయారై క్రమంగా మూర్ఖురాలిగా మారుతుంది. తద్వారా అనేక ఇబ్బందులుపడుతూ, సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. అంతేకాక అకారణంగా చంద్రకళ మీద ద్వేషం ఏర్పరచుకుని చివరికి ఆ ద్వేషం, ఆ మొండితనంవల్ల మానసిక రోగిలా తయారవుతుంది రాణి.
చిన్నప్పటినుంచీ మమతానురాగాలు పెంచుకున్న జగదీష్ విషయంలో కూడా రాణి పోటీని ఎంతో హుందాగా భరిస్తుంది చంద్రకళ. చివరికి ఆమె హుందాతనమే ఆమెని రక్షిస్తుంది.
ఒక నాట్యకళాకారిణిగా తయారవాలంటే ఎంతకృషిచేయాలి, ఎంత పట్టుదల ఉండాలి కళపట్ల అంకితభావం ఉండాలి అనే విషయాలను ఎంతో చక్కగా ఆర్ద్రంగా, అందంగా చెప్పారు ఉమాభారతి. ఒక కళాకారిణిగా తన అనుభవాలను, అనుభూతులను కూడా ఈ వేదిక నవల రాయడంలో చూపించి పాఠకులను చివరిదాకా చదివింపచేసారు రచయిత్రి.
ఈ నవలలో మనుషుల మధ్య ఉండే అనురాగాలు, ప్రేమానుబంధాలు, గురుశిష్యుల మధ్య ఉండే గౌరవాభిమానాలు, ఇవేకాక చక్కటి స్నేహానుబంధాలను కూడా స్పృశించి పాఠకుల హృదయాలను గెల్చుకునే ప్రయత్నంచేసారు.
ఈమె ఎన్నుకున్న కథావస్తువుకి తగిన సంఘటనలు, సన్నివేశాలు, పాత్రల రూపకల్పన ఎంతో సహజంగా, మన కళ్లముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇందులో రాగద్వేషాలు, మానవ సంబంధాలు, మంచి మనసులు పాఠకులను మంచి భావనకు గురిచేస్తాయి. ఒక వెబ్‌మ్యాగజైన్ గో తెలుగు డాట్‌కామ్‌లో ధారావాహికంగా ప్రచురించబడిన ఈ నవలని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు పుస్తక రూపంలో వెలువరించారు.

-అత్తలూరి విజయలక్ష్మి