అక్షర

వారి తీరే వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి తీరే వేరు
(వ్యంజకాల సంపుటి)
-పొత్తూరి సుబ్బారావు
వెల: రూ.100/-
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
వ్యంగ్యార్థాన్ని తెలిపే శబ్దానికి ‘వ్యంజకము’ అని నిఘంటువుల్లోని అర్థం. అభినయము, గురుతు అనే అర్థాలు కూడా కనిపిస్తాయి. ‘అసలు ఒకటి - అంతరార్థం ఒకటి’ అన్నది లోకసహజం! బొమ్మ-బొరుసు లాగానే, వ్యంజితము అయ్యే - అంటే బయలుపరుపబడే భావాలతో నాణేనికి రెండు వైపులనూ చూపే ఒక కవితా ప్రక్రియకు సుబ్బారావుగారు ఒక క్రియేటివ్ లింక్ సంతరించారు. దానిని ఎందరో అందిపుచ్చుకోవడం మాత్రమే కాదు, చిత్రంగా ‘మూలకారకుడు’కన్నా ముందుగానే ఐదుగురి వ్యంజకాల సంపుటాలు ముద్రితమయ్యాయి. దాదాపు వ్యంజకాలు రాసిన కవులు వందమంది దాకా ఉన్నారు. ఇంకెందరో ప్రాదుర్భవిస్తున్నారో కూడాను. ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ రెండూ కలగలసిన ‘వ్యంజకము’ ఒక ‘విద్యుద్దీపం’. ఆ రెండు వైర్లను సరిగ్గా కలిపి మెలివేయడం ముఖంగా. ఈ వ్యంజకాలు చదువుతుంటే పఠిత ‘్భలే’ అనుకోవాల్సిందే.