అక్షర

సినారె సృజనలు... కొండ అద్దమందు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినారె సాహితి ప్రాభవం (ప్రసంగ వ్యాస సంకలనం)
వెల: రు.100/-;
ప్రతులకు- వంశీ సంస్థ,
నవోదయ బుక్‌హౌస్
హైదరాబాద్.
**
డా.సి.నారాయణరెడ్డి ఆధునిక సాహితీ శిఖరం. ఆయన నిత్య సృజనశీలురు. ఎన్ని ప్రక్రియలు చేపట్టినా వారి శ్వాస కవిత్వమే. సినారె 86వ పుట్టినరోజు సందర్భంగా వంశీ సంస్థ వ్యవస్థాపకుడు శిరోమణి వంశీ రామరాజు ప్రముఖులచే తొమ్మిది రోజులు సినారె సాహితీ ప్రాభవం పేరిట ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. అవి గాలికి పోకుండా పుస్తక రూపంలో భద్రపరిచారు. ఈ ప్రచురణకు సాహిత్య సంగీతాభిలాషులు, అమెరికాలో హృద్రోగ నిపుణులు డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డిగారు ముందుకొచ్చారు.
ఇందులో 10 వ్యాసాలున్నాయి. ఇవి లోతుగా పరిశీలించి రాసినవే. వీటి ఆధారంగా ఎవరైనా పరిశోధన చేయవచ్చు లేదా ప్రత్యేకంగా పుస్తకాలూ రాయవచ్చు. అంత ప్రేరణను కలిగించే వ్యాసాలివి. డా.ఎన్.గోపి సినారె కొత్త కవితా సంపుటి ‘‘నారణం మరణం పైనే’’పై విశే్లషణాత్మక వ్యాసం రాశారు. సినారె తాత్త్విక చింతనను, కవితాత్మను సముచితంగా వివరించారు. డా.గౌరీశంకర్ సినారె సినీ గీతాల వైభవాన్ని విశే్లషించారు. సినీ గీతాలను ఆయా చిత్రాల నేపథ్యంలో వింగడించిన రీతి ప్రశంసార్హంగా వుంది. ఎం.నారాయణశర్మ తనదైన రీతిలో సినారె మానవీయతను వెల్లడించారు. సినారె సిద్ధాంత వ్యాసం ఇప్పటికీ గొప్ప ఆకర గ్రంథం. 1960లలో అంత సమాచారం సేకరించి విమర్శతో రాయటం గొప్ప విషయం. కవిత్వోద్యమాలపై ఒక అవగాహన ఏర్పరిచింది సి.నారాయణరెడ్డిగారే! అటువంటి ‘‘ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు ప్రయోగములు’’అనే పరిశోధన గ్రంథంపై డా.గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి రాసిన వ్యాసం ప్రామాణికతతో కూడుకొన్నది. అనేక కోణాలను తెలియజెప్పారు.
సినారె రూపక సాహిత్య దర్శనం, సినారె గేయ కావ్యాలు అనే వ్యాసాలలో కొన్ని పునరుక్తి అయ్యాయి. ఇక్కడ సూక్ష్మవిభజన చేసి నిర్దేశిస్తే బాగుండేది. కవిగానే కాకుండా విమర్శకుడిగా కూడా సినారె ఎలా ప్రతిభ కనబరిచారో సిహెచ్.లక్ష్మణచక్రవర్తి విశదీకరించారు. అమ్మంగి వేణుగోపాల్ ‘సినారె ముక్తకాలు’ వ్యాసం కొత్తగా వుంది. గజల్‌పై పరిశోధన చేసిన పెన్నా శిరాకు సినారె గజళ్ళను వివేచించారు. మరొక నూతన వ్యాసం పత్తిపాక మోహన్ రాసిన ‘సినారె అనువాద కావ్యాలు’’. సినారె సాహితీ ప్రాభవ కార్యక్రమరూపకర్త డా.జె.చెన్నయ్య, వంశీ రామరాజు అభినందనలకి అర్హులు. సినారె సమగ్ర సాహిత్యంపై సదవగాహన కలిగించే మంచి పుస్తకమిది

-ద్వా.నా.శాస్ర్తీ