అక్షర

ఉత్తరాల్లో అంతులేని ఆలోచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలం నాన్న లేఖలు
సంపాదకులు డా. కె.అరుణజ్యోతి.
పుటలు:100, వెల:135, నవ్య పబ్లికేషన్స్ హైదరాబాద్,
ప్రతులకు: ఫో:040-24150533, శ్రీనివాసం అపార్ట్‌మెంట్స్,
సైదాబాద్ కాలనీ, హైదరాబాద్-59.
**
రచయిత గుడిపాటి వెంకటచలం రాసినంత కాలం ‘చలం’ పద్ధతిలో రాసి పేరు పొందారు. ఆ తరువాత పూర్తిగా మారిపోయి రమణాశ్రమంలో అంటే అరుణాచలంలో వున్నారు. అక్కడి నుంచి ఆయన చాలామందికి చాలా ఉత్తరాలు రాశారు. అవన్నీ కూడా ‘చలం’ పద్ధతిలో కపటం లేకుండా విచ్చలవిడిగా వుంటాయి. చాలామందికేమోగానీ, చింతా దీక్షితులు లాంటి మిత్రులకు రాసిన ఉత్తరాల్లో ప్రపంచం గమనించదగిన ఆలోచనలు చాలా కనిపిస్తాయి.
ప్రస్తుతం పుస్తకంగా వచ్చిన ఈత్తరాలను చలంనాన్న, (ఆయనను నాన్న అనడం ఒక పద్ధతి) కామేశ్వరి అనే ఆవిడకు రాశారు. ఈ కామేశ్వరి జీవితం ఒక నవలలాగ సాగుతుంది. ఆమె తన గురించి, చలం గురించి రాసిన సంగతులు పుస్తకం చివర్లో వున్నాయి. అవి చదవడానికి బాగున్నాయి కూడా.
పుస్తకం మొదట్లోనే, ఓల్గా, మృణాళిని గారలు చలం గురించి, ఉత్తరాలు గురించి కొంత పరిచయం చేసే ప్రయత్నం చేసారు. కామేశ్వరిగారికి రాసిన ఉత్తరాలలో విశాఖపట్నం, భీలీ సముద్రాలపై ఆయన ప్రేమ తెలుస్తుంది అంటారు ఓల్గా. కామేశ్వరికి ఆయనిచ్చే సలహాలు లోకమంతటికీ- అంటారామె. చలం ఉత్తరాలకు ఒక మెథడాలజీ వుంది. అవి ప్రేమను కురిపిస్తాయి అన్నది మృణాళినిగారి మాట. తన అభిమానిగా, పుత్రికా సమానురాలిగా, స్నేహితురాలిగా, చలం కామేశ్వరికి రాసిన ఉత్తరాల్లో విద్య, స్ర్తి స్వాతంత్య్రం, పాతివ్రత్యం లాంటి అంశాలు తలెత్తుతాయి.
వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారు కూడా ఒక వ్యాసంలో తమ అనుభవాలను, అనుబంధాన్ని వర్ణించారు. కామేశ్వరిగారికి ప్రస్తుతం ఎనభయి నాలుగేళ్ల వయసట. ఇప్పటికి ఈ ఉత్తరాలను ప్రపంచం ముందు పెట్టాలని ఎందుకు తోచిందీ అర్థంకాదు. చలం అభిమానులకు తప్ప మిగతావారికి ఈ పుస్తకం ఎంత ఆసక్తికరంగా వుంటుంది అన్నది ప్రశ్న!
చలం గురించి ఆయన ప్రపంచం గురించి, రచనల గురించి తెలిసినవారికి తప్ప ఈ ఉత్తరాల పట్ల ఆసక్తి ఎందుకో అర్థంకాదు. ఒకటి మాత్రం నిజం. చలం మారలేదు! చివర వరకూ తన ధోరణి తనదే!

-కె.బి.