అక్షరాలోచన

బ్రతుకు నాటకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగములో జన్మమే చిక్కు నాటకము

మాయవి జీవితమే మహర్నాటకము
తోయజాక్షుడు నడుపు తనరు నాటకము

అమ్మ, నాన్నల తోటి ఆరంభమై యిది,
తమ్ము, డన్న, యక్క, చెల్లితో గూడి
కమ్మని అనుబంధ, ఆప్యాయతలతో
కమ్ముకొన్న ఘన ప్రేమ నాటకము

గురువులతో గూడి గాఢమై పెరిగి
మీరి మిత్రులతో మధురమై పోయి,
పెరిగి కొలువులలో పల్లవించి ఎదిగి
వర్థిల్లు వింతగ విశ్వనాటకము

ఆలు బిడ్డలతో అనురాగ మిళితమై
వలపు తేనెలు తాగి వైభోగమొంది
సొలసెటి వరకు ఆడుచు, పాడుచు
కలలాగ సాగేటి కపట నాటకము

తనువు శాశ్వితమనే తామసములో చిక్కి
క్షణిక సుఖములకై తత్వము విడనాడి
ఎనె్నన్నో భావముల నవరస భంగిమల
వెన్ను డాడించు జగన్నాటకము
*

-రమాకాంతరావు చాకలకొండ