అక్షర

జగ్గన రచనా వైదుష్యానికి మెచ్చుతునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుభద్రా పరిణయము
- ఉన్నం జ్యోతిరావు
వెల: రూ.175/-
ప్రతులకు: రచయత,
వేములపాడు పోస్టు
వయా పెరిందేవి
ప్రకాశం జిల్లా- 523273
**
సుభద్రార్జునుల వివాహాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఎన్నో రచనలు వచ్చినాయి. అందులో కూచిమంచి జగ్గకవి రచించిన సుభద్రా పరిణయము విశేషంగా జనాదరణకు నోచుకున్నది. ఈ కావ్య సౌందర్యం జగ్గన రచనా వైదుష్యానికి మచ్చుతునక అని చెప్పవచ్చు. జగ్గన సుభద్రాపరిణయాన్ని పరిష్కరించి దానిని సుదీర్ఘ పీఠికతోపాటుగా పఠితలకందించారు ఉన్నం జ్యోతివాసుగారు. దీనికి కూచిమంచి జగన్నాథ (జగ్గ) కవిప్రణీత సుభద్రా పరిణయమనే పేరు పెట్టారు. పరిశోధనాత్మకంగా వున్న ఈ పీఠిక ఉపయుక్తమైన విషయాలను అనేకం అందించింది. దీనిలో జగ్గన వ్యక్తిత్వం, రచనా కౌశలం సమగ్రంగా రూపుదిద్దుకున్నాయి. ఈ పీఠికకు రచయిత సేవలు అనే పేరునుంచారు. పరిశిష్టములో కూడా కావ్య విశేషాలు, భాషా విశేషాలు తెలిపారు. కార్యకర్త అయిన జగ్గకవి వంశ చరిత్ర, వారి వంశస్థుల రచనలు, వారు పొందిన గౌరవాలు తెలియజేశారు. జగ్గన మనస్తత్వాన్ని తెలుపుతూ రచయిత అన్నచాటు తమ్ముడిగా మెలిగినవాడని రచయిత తెలిపారు. కుకవి నిందను చేయకపోవడానికి, హద్దులుమీరిన వర్ణనలు చేయకపోవడానికీ కవి సున్నితమనస్కుడు కావడంవల్లనేనని భావించారు. సంస్కృత మహాభాగవతం, శ్రీమదాంధ్ర మహాభారతం, భాగవతాలలో సుభద్రా పరిణయం చిత్రితమైన తీరును ప్రస్తావించారు. సుభద్రకు సంబంధించిన సాహిత్యాన్ని అందించిన కవుల పేర్లను, వారి రచనలను జాబితాగా ఇచ్చారు. కవి పూర్వకవులను అనుసరించినవి, పూర్వ కవులను అనుసరించనివి అయిన అంశాలను చర్చించారు. కథాకథనంలోను, వర్ణనలలోను, పదప్రయోగంలోను, భాషాప్రయోగంలోను, అష్టాదశ వర్ణనలలోను జగ్గన చేసిన మార్పులను చేర్పులను వివరిస్తూ వాటికి కారణాలను కూడా వివరించారు. జగ్గకవి అవసరమైనచోట్ల వర్ణనలు పెంచాడు. అవసరంలేనిచోట్ల వర్ణనలు తగ్గించాడు. కుమారసంభవము, దౌహృదవర్ణన మొదలైన వర్ణనలు కథాగమనానికి ఆటంకం అని భావించినచోట్ల వాటిని విడిచిపెట్టాడు. చేమకూర వేంకటకవి ప్రభావంతో చేసిన అంశాలను రచయిత వివరించారు. అర్జునుడు తీర్థయాత్రలు చేసే సందర్భంలో జగన్నాథస్వామిని కూడా దర్శించినట్లు పేర్కొనడానికి కారణం కవికి ఇష్టదైవం జగన్నాథస్వామి కావడమేనని పేర్కొన్నారు. కుహనా మస్కరికి నమస్కరించి వంటి ఛేకానుప్రాసాలంకారాలు, శే్లషాలంకారాలు కావ్యసౌందర్యాన్ని ఏ విధంగా ఉద్దీపింపజేశాయో రచయిత తెలిపారు. రత్నగర్భ అనే పదానికి కవులు చెప్పిన నిదర్శనంగా నిలుస్తున్నాయి. అర్జునుని పాత్ర చిత్రణ ఈ పుస్తకంలో మనకు సమగ్రంగా కనిపిస్తుంది. వివిధ గ్రంథాలలో సుభద్రార్జునుల పరిణయానికి మూలమైన ఘట్టాలను కూడా వివరించారు. సుభద్రా పరిణయంతోపాటు రచయిత ఉన్నం జ్యోతివాసుగారి వ్యాఖ్యానంతో కూడిన పీఠిక ఆద్యంతమూ ఆసక్తిదాయకంగాను, ఉపయుక్తంగాను ఉంది.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ