అక్షర

శాంతిసాగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతిసాగరం
-సరికొండ నరసింహరాజు
వెల: రూ.50/-
ప్రతులకు: రచయిత
ఇం.నెం.ఎ-116, పైలాన్ కాలనీ
నాగార్జున సాగర్- 508 203
94413 64022
**
దేశంలో కన్పిస్తున్న అభ్యుదయ నిర్మాణాలలో ఒకటైన నాగార్జునసాగర్ ఆనకట్ట ఒక సజీవ శిల్పం. చూడగలిగిన నేర్పరికి కళానిలయమైన ఆధునిక దేవాలయం. ‘సరికొండ’ ఈ మహాసాగర దృశ్యాన్ని వివిధ కోణాలలో సుందరంగా, మనోహరంగా, సద్భావనా రమ్యంగా, కళామతల్లిగా దర్శించి, హృద్యంగా రచించిన గేయ కావ్యం ఈ ‘శాంతిసాగరం’. అమర కార్మికులు, కృష్ణమ్మ తల్లి, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, పచ్చని చెట్లు, రైతు ఆవేదన, నిర్వాసితులు, వర్తమాన సాగరం మొదలగు అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించి విరచించిన సాగర కవితల సమాహారం ఈ శాంతిసాగరం. కృష్ణనది ఓ కవితా సంపుటిలా అలలే కవితలంటూ అల్లిన తీరు అనితరసాధ్యం. ఏ నేల బుద్ధుని ధాతువుతో పరమ పవిత్రమైందో, ఏ నేల నాగార్జునుడి బోధనలతో పరిఢవిల్లిందో, ఏ నేల తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలకు సాగు తాగు నీరందిస్తూ.. అన్నపూర్ణ తల్లిగా పూజలందుకుంటుందో, శ్రీపర్వత శిఖరాలు పచ్చని లోయలు నిత్యమూ కృష్ణమ్మ అలలతో ప్రతిధ్వనిస్తుంటాయో.. ఈ నేల తల్లి సాక్షిగా ఈ కవితలు పాఠకుల్ని అలరించనున్నాయి.