అక్షరాలోచన

వాడి పేరు ‘ర్యాంక్ కార్డ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ర్యాకుల నిండా
ర్యాంకుల కార్డులే...
ఆ పిల్లాడు మాట్లాడగా
నే విన్నది లేదు...
ఆ చిన్నారి నవ్వగా
నే చూసింది లేదు...
ఆ గది మూలగా
పుస్తకంలో పుస్తకంగా చూశా...
రెడ్ మార్క్ కనిపిస్తే
48 గంటలు నిద్ర మానేసిన
వాడి కళ్లను చూశా...
అతి చదువుతో చిక్కిన
చక్కని మేధని చూశా...
తిండిని త్యాగం చేసిన
బక్కనైన దేహాన్ని చూశా...
ర్యాంకులు తప్ప
మెదడులో మరేం ప్రవహించట్లేదు...
అతని అమ్మానాన్నల ముఖాల్లో
వెలకట్టలేని చిరునవ్వుల దివ్వెల్ని చూశా...
ఫంక్షన్‌కెళ్లినా, గెట్ టు గెదర్‌లకెళ్లినా.
ఔటాఫ్ ప్లేస్‌కి వెళ్లినా...
వాడే స్పెషల్ డిస్‌ప్లే ఐకాన్!
వాళ్లు చెయ్యలేని, చదవలేని భారాల్ని
వాడిలో స్లోపాయజన్‌గా ఎక్కించడం చూశా...
వాడి జన్మ వాడిది కాదు... ఆ ర్యాంకులది...
వాడి పేరు మర్చిపోయారంతా
‘ర్యాంక్ కార్డ్’ అందరూ పిలిచే సాధారణ నిక్‌నేమ్
రక్తమాంసాలున్న కొడుకును కాదు వాళ్లు కన్నది
పచ్చగా మెరిసే ర్యాంక్ కార్డుని
కీ ఇస్తే కదిలే రోబోని...!

- అమూల్యాచందు కప్పగంతు, 9059824800