అక్షరాలోచన

సమానత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్కన కూర్చోబెట్టుకోగానే
మురిసిపోయాను
తరువాత అర్థం అయ్యింది
నీ ఆధిపత్యం కోసం
నాకు కుర్చీ వేశావని

తరాలుగా
బానిసగా
నన్ను చూసిన నువ్వు
మనిషిగా మారావనుకున్నా!
నీ అస్తిత్వ మనుగడ
రాజకీయమైన చోట
నేనిక పావుని కాను

వైకుంఠపాఠీ గుండు నువ్వే విసురుతావు
పాముల నుంచి నువ్వే తప్పిస్తావ్
గెలుపు నాదే
విజేత నేనే.

నా పక్కన కుర్చీ నీదే
సోదరా అని పిలవడం
ఇప్పుడొక నీ అనివార్యం...

- మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్ 9490455599