అక్షర

ఒకనాటి సామాజిక చరిత్రకు దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మభూమి
(సాంఘిక నవల)
-అయ్యదేవర
పురుషోత్తమరావు
వెల: 100/-
ప్రతులకు: నవోదయ, ఇంకా
అన్ని ప్రముఖ విక్రయశాలలు.
**
అయ్యదేవర పురుషోత్తమరావుగారి పేరు చెప్పగానే మనకు అలనాటి మహానాయకుడు కాళేశ్వరరావుగారు గుర్తుకువస్తారు. వీరు వారి వంశీయులే. పురుషోత్తమరావు ముందుగా నటుడు. తర్వాత రచయిత. శ్రీకృష్ణ పాత్రకు ఈయన పెట్టింది పేరు. లోగడ మరదలు వంటి సాంఘిక నవలలు గణపతి దేవుడు, ప్రౌఢ దేవరాయలు వంటి చారిత్రక నవలలు వ్రాసిన రచయితగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. ఇప్పుడు సామాజిక చారిత్రక నవలలతో మనముందుకు వచ్చారు. దీనిపేరు జన్మభూమి. ఇందలి ఇతివృత్తం ప్రధానం ఖమ్మం జిల్లాకు సంబంధించినదే అయినప్పటికీ 1947నాటి తెలంగాణా చరిత్రయే అని చెప్పవచ్చు. సామాజిక చారిత్రక నవల లక్షణం ఏమంటే అది ఒకనాటి సాంఘిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని రచింపబడి నేడు చరిత్రగా మిగిలిపోయిన కథ అని అర్థం. అంటే నాటి అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, ఝాన్సీరాణి కథలు నేటికి చారిత్రక నవలలే కదా? తెలంగాణాలో అసఫ్‌జాహీల పాలనలో చివరి రాజు ఉస్మాన్ ఆలీఖాన్. ఇతని కాలంలో రజాకార్లు చాలా దుర్మార్గాలకు పాల్పడ్డారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణాకు రాలేదు. ఇక్కడి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వామపక్షీయ ఉద్యమం కూడా సాగింది. ఖమ్మంలో జమలాపురం కేశవరావు పేరు తెలియనివారు ఆ తరంవారు ఎవరూ లేరు. ఆయన అకల్పక స్వాతంత్య్ర సమరయోధుడు. ఈ రచయితకు జమలాపురం వారితో రక్తసంబంధం కూడా ఉంది కాబట్టి ఒకానొక కాల్పనిక కథను తీసుకొని ఆనాటి చరిత్రను ఆలంబనగా మార్చుకొని ఈ జన్మభూమి నవల రచించారు. ‘ఇందలి శారద, పరంధామయ్య సారధి వంటి పాత్రలన్నీ దాదాపు వాస్తవాలే. ఏ నవలకైనా రీడబిలిటీ ప్రధాన లక్షణం. అంటే పురుషోత్తమరావుగారి కథ కథనం సామాన్య పాఠకుణ్ణి ఆకర్షించే ధోరణిలో సాగింది. ఎక్కడా అశ్లీల స్పర్శలేకుండా ఒకనాటి చరిత్రకు దర్పణం పట్టిన ఈ నవలలో ప్రధానంగా మనకు ఆనాటి గ్రామీణ వాతావరణం చిత్రీకరింపబడింది. ఇందులో ఉదాహరింపబడిన ఎర్రుబాలెం గ్రామ వాస్తవమే కాని కల్పితం కాదు. అందులో ఆనాటి నటులు కళారూపాలు, అతిథి మర్యాదలు, శిష్టాచారాలు అన్నీ నిజమైన పేర్లతో సహా యథాతథంగా ఈ నవలలో వర్ణింపబడ్డాయి. శారద సారథిని బావా అని పిలవాలని కోరిక పుడుతుంది. అంటే కథాసంవిధానం కోసం ఒక ప్రణయేతి వృత్తాన్ని కూడా చేర్చారు. మంగళాదీని మంగళం దాని అన్నట్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియలో జాతీయవాదులు విజయం సాధించటం, వారి సన్మానాలు, శుభకార్యక్రమాలతో కథ ముగిసింది. రచయిత దీనికి ముఖపత్రం మీద సాంఘిక నవల అని పేరు పెట్టినా ఇది సామాజిక చరిత్రక నవలా వర్గం కిందికే వస్తుంది. బుక్‌కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగిన రోజులలో ఒక సాంఘిక నవల వ్రాయటం సాహసమే. సాహసమే కాని పురుషోత్తమరావుగారు చేసింది దుస్సాహసం మాత్రం కాదు. లోగడ దాశరథి రంగాచార్య వంటివారు ఆనాటి తెలంగాణా చరిత్రపై కొన్ని రచనలు చేసి ప్రసిద్ధినొందారు. ఇందులో చాలావరకు రచయిత అంతరంగంలో స్వీయచరిత్రను కూడా దర్శింపవచ్చు.

-ముదిగొండ శివప్రసాద్