అక్షర

కొంత కాల్పనికత.. కొంత యథార్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయుధం
-టి.ఎస్.వి.కృష్ణమూర్తి
వెల: రు. 180
పుటలు: 204
ప్రతులకు అన్ని
పుస్తక కేంద్రాలు
**
రచయిత్రులకు రచయితలకు ఎదురయ్యే సమస్య కథా వస్తువు ఎంపిక. సమాజాన్ని నడిపించే శక్తులని గుర్తించగల నేర్పువుండాలి. నిజ జీవితంలో జరిగిన మార్పులు, సంఘటనలు కూడా రచనకు ప్రేరణ కల్పిస్తాయి. 1940-2000 సంవత్సరాల మధ్య ఎదురైన అనేక అనుభవాలకు కొంత కాల్పనికతను జోడించి రాయబడిన నవల ‘ఆయుధం’. రచయిత టి.ఎస్.వి.కృష్ణమూర్తి తన అరవై ఏడేళ్ల జీవిత అనుభవం పఠన, రచన అనుభవాలను ఈ నవల్లో పొందుపరిచారు.
కథా నాయకుడు రాజయ్య, రచ్చబండ దగ్గరనుంచి ఇంటికి వెడుతుండగా అక్కడ గుమికూడిన పిల్లలలో ఒకడు పిపి ఎయిటీన్ డౌన్ అనడము, అతని మిత్రులు నవ్వడముతో మొదలవుతుంది. అయినా పట్టించుకోకుండా తన నడక కొనసాగిస్తాడు రాజయ్య. ఇంటికి చేరిన రాజయ్య అన్యమనస్కంగా వుండడం భార్య భాగ్యలక్ష్మి గమనిస్తుంది. కారణం ఏమిటి అన్నప్పుడు ఊళ్లో పిల్లలు పి.పి.ఎయిటీన్ అనడము చెబుతాడు రాజయ్య. పి.పి.ఎయిటీన్ అంటే పారిపోయిన పిరికివాడి సంఖ్య నంబరు పద్దెనిమిది అని తెలుసుకున్న భాగ్యలక్ష్మి ‘నువ్వు పిరికివాడివి కాదు’ అనడంతో గతం జ్ఞాపకం రావడంతో కథ ఫ్లాష్ బాక్‌లోకి వెడుతుంది.
రాజయ్య మూడేళ్ల బాలుడుగా వున్నప్పుడు ఊరి పెద్దలయిన నాయుడు, రెడ్డి, స్వామి తన తల్లిని మానభంగం చేయడం చూస్తాడు. మర్నాడు తల్లి ఆత్మహత్య అతన్ని ప్రతీకారం వైపు పురికొల్పుతుంది. తల్లి మరణానికి కారణమైన ముగ్గురినీ అంతం చేయాలన్న నిర్ణయం పసి వయసులోనే తీసుకుంటాడు. తండ్రి పెంపకంలో బుద్ధిగా చదువుకుని తన ఊరి బాగుకోసం అంకితమవుతాడు. ఊరిలో వున్న ప్రజలందరినీ అదుపులో వుంచుకోగల శక్తి సామర్ధ్యాలున్న వారు ముగ్గురు శివశర్మ, రామానాయుడు, జయారెడ్డి. శర్మ వారసత్వం గా లభించిన పౌరహిత్యంతోపాటు కరణీకం కూడా చేస్తుంటా డు. రామా నాయుడు వంశీయు లు న్యాయ నిర్ణేతలుగా, ఆలయ ధర్మకర్తలుగా స్థిరపడ్డారు. జయారెడ్డి వంశీయులు రెడ్డి పని చేస్తున్నారు. ఆ ముగ్గురికీ అధినేత త్రిమూర్తులు. గ్రామం ఆయన నిరంకుశ పాలనలో మగ్గుతూ వుంటుంది. ఆయన ఇంటి ముందు నుంచి ఎవరూ పాదరక్షలు ధరించి నడవకూడదన్న కట్టుబాటు చిత్రమనుకుంటే ఆయన వస్తుంటే ఎవరు ఎదురుగా నడవకపోవడం మరో విచిత్రం.
ఎంతటి వాడైనా తన తల్లి మరణానికి కారకుడైనవాడిని, వాడి అనుచరులను అంతం చేయాలన్న కృతనిశ్చయంతో వున్నవాడు రాజయ్య. అతనికి చిన్నతనం నుంచీ నాయకత్వం లక్షణాలున్నాయి. పాఠశాలనుంచి ఇంటికి వచ్చిన తర్వాత పాఠాలు చదువుకోవడానికి సరైన దీపం కూడా లేని పరిస్థితి. ఊరికి కరెంటు సరఫరాలేదు. సోషల్ మాస్టారిని ‘మావూరి మధ్యన వీధి దీపం వెలిగించే ఏర్పాటు చేయాలంటే ప్రధానమంత్రికి ఉత్తరం రాయాలా’ అని అడుగుతాడు. మాస్టారు జిల్లా కలెక్టరుకు రాయమన్న సలహా పాటించి జిల్లా కలెక్టరు గారికి వినతిపత్రం రాసి అందచేస్తాడు. సానుకూలంగా స్పందించిన కలెక్టరు రాజయ్య ఊరితోపాటు చుట్టుపక్కల పల్లెలకు కూడా విద్యుత్ సరఫరా సదుపాయం కలిగిస్తారు.
రాజయ్య ఊరికి వయోజన విద్యా నిలయాన్ని సాధించడమే కాకుండా అక్కడ పాఠశాల ఉపాధ్యాయుడుగా నియమించబడతాడు. చిన్ననాటి స్నేహితురాలైన భాగ్యలక్ష్మితో వివాహం జరుగుతుంది. కాలప్రవాహంలో కొన్ని సంవత్సరాలు జరిగాక త్రిమూర్తులనంతం చేయడానికి మార్గాన్ని అనే్వషిస్తాడు. ధైర్యం కత్తితో పొడిచేసి తర్వాత శిక్షను అనుభవించవచ్చునన్న ఆలోచన వస్తుంది. తన చేతులకు రక్తం అంటకుండా ఎలా అంతం చేయవచ్చు అన్న ప్రణాళిక ఆలోచన కూడా వస్తుంది. రాజయ్య అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడా లేదా? అన్నది నవల చివరి అధ్యాయంలోని చదువరికి తెలుస్తుంది.
ఈ నవల నది మాసపత్రిక వచన రచనా నవలల పోటీలో బహుమతి పొందింది. రచయిత కలంనుంచి వెలువడిన పుస్తకాలలో పదునాలుగోది. పదిహేనవ రచన త్వరలోనే వెలువడుతుందని ఆశించవచ్చును.

-పాలంకి సత్యనారాయణ