అక్షర

కులమతాల ఆవేదనా ఇతివృత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనూహ్య పెళ్లి (నవల)
-సలీం
వెల: రు.150
ప్రతులకు: విశాలాంధ్ర,
నవోదయ
**
సైఫ్ ముస్లిం. అతని భార్య రాణి బ్రాహ్మణ స్ర్తి. పెళ్లీడుకు వచ్చిన వారి కుమార్తె అనూహ్యకు సంబంధాలు వెదికే ప్రయత్నంలో వారు ఎదుర్కొన్న వివిధ సమస్యలు, అడ్డంకులు - అదే ఈ నవలకు ఇతివృత్తం.
కులమతాలకు అతీతంగా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి సమాజంలో లేనందుకు బాధపడడం, సమాజంలో అసలు కులమతాల ప్రసక్తే వుండకూడదని భావించడం ఈ నవల పొడుగునా కనిపించే విషయం. మనుషుల మధ్య కులమతాల ప్రసక్తి లేని స్నేహ బాంధవ్యాలను కోరుకోవడం సైఫ్, రాణీల సహృదయతను తెలియజేస్తుంది. అయితే ఈ పాత్రలు రెండు కూడా సమాజంలోని చాలామంది వలె కులాతీత మతాతీత వివాహలు జరగాలని కోరుకునే పాత్రలే కానీ అలా జరగడానికి, జరగకపోవడానికి వుండే కారణాల పట్ల తద్వారా ఏర్పడే పరిణామాల పట్ల పూర్తి అవగాహన వున్న పాత్రలు కావు.
బ్రాహ్మణులు, ముస్లింలు, బ్రాహ్మణేతర అగ్రకులాలు, దళితవర్గాలు -ఇలా అన్నివైపులనుండి పెళ్లి సంబంధాలు వెదికే ప్రయత్నం చేయడం ద్వారా కులం పట్ల వివిధ వర్గాల్లో వుండే ఆలోచనలను పరిచయం చేసేందుకు రచయిత ప్రయత్నించారు. అలాగే కులమతాలతో పోల్చినపుడు చదువు, ఆర్థిక స్థితి, ఉద్యోగం, హోదా మొదలైన వాటికి దక్కే/దక్కని ప్రాముఖ్యాన్ని కూడా కొన్ని సంఘటనల ద్వారా వివరించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ప్రధాన పాత్రలైన రాణి, సైఫ్, అనూహ్య-వీళ్లు ముగ్గురు కూడా ఆయా సంఘటనలను పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, సమస్యయొక్క మూల తత్వాన్ని గ్రహించడం లో సూక్ష్మాన్ని అందుకోవడంలో పూర్తి సాఫల్యాన్ని సాధించలేకపోవడం కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన ఈ నవల చర్చకు తీసుకున్న గంభీరమైన అంశాలన్నిటినీ మరింత లోతుగా స్పష్టంగా చర్చంచి వుండవలసిందని అనిపిస్తుంది.

-శ్రీ