అక్షర

తెలుగువారి సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొబ్బి పాటలు
సంకలనం: కప్పగంతు వెంకట
రమణమూర్తి
మూల్యం: రూ.45/-
ప్రతులకు: గ్లోబల్ న్యూస్
బి2, ఎఫ్12, రామరాజానగర్
సుచిత్రా సెంటర్,
సుచిత్రా జంక్షన్ పోస్ట్,
సికిందరాబాద్-500 067.
9246165059
**
తేనెలూరు తెలుగు భాష తియ్యందనాలు చవిచూడని వారుండరు. మన తెలుగు జీవ భాష. వీనుల విందైన భాష. దక్షిణాపథాన తిరుగులేని భాష. తెలుగుకు ప్రాచీన హోదానే కాదు యావద్భారత దేశానికి రెండవ అధికార భాషగా గుర్తింపబడటానికి అన్ని అర్హతలు ఉన్న భాష. అనాదికాలంగా తెలుగు ప్రజా భాషగా ఉంటూ వస్తోంది. మాట, పాట, పదం, పద్యం, కావ్యం, ప్రబంధంగా తెలుగు ఎంతో ప్రాచుర్యం పొందింది. జనపదం నుంచే పాట పుట్టుకొచ్చింది. మాటలో ఉన్న పటుత్వం, పాటలో ఉన్న ఆ సొగసు, లాలిత్యం ప్రజల భావాలను ప్రస్ఫుటింపజేస్తుంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అనేక కళారూపాలకు తెలుగునేల ఎంత ప్రసిద్ధమైనదో మనందరకూ తెలుసు. అందులో సంక్రాంతి సందర్భంగా హాయిగా కన్నియలు అందరూ ఒకరికొకరు కూడుకుని సంబరంతో పాడుకునే గొబ్బి పాటలు ఎంతో ప్రాచీనమైన జానపద సుగంధం. తెలుగువారి గొబ్బి పాటలలో జానపదం తొణికిసలాడుతుంది. భక్త్భివంతో పాటు తెలుగువారి ఆచార వ్యవహారాలు, సంక్రాంతి సంబరాల తీరును, యువతుల ఆనందోత్సాహాలు మనకు ఈ గొబ్బి పాటలు తెలియజేస్తాయి. తెలుగువారు ఆచరించే సంక్రాంతి పండుగలో భాగమైన గొబ్బి పాటలను, భోగిపండ్ల పాటలను కూర్చి పుస్తక రూపంలో తెచ్చారు.