అక్షరాలోచన

ఆకురాలు కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురాకు పచ్చగా లేతాకు పచ్చగా
ముదురాకు పచ్చగా పచ్చపచ్చగా
ఊరేగిన నా జీవితం
ఆఖరి అంకంలోకి అడుగువేసింది!
రోజుకో రంగు అద్దుతూ
తల్లి చెట్టు
నన్ను ప్రదర్శనకు పెడుతూ ఉంది
రాలిపోయే ఆకుకు
రంగులెందుకని అడగొద్దు
మరణిస్తూ సూర్యుడు మలి సంధ్యలో
గీచిన రంగులు నాకు ప్రేరణ!
ఊసరవెల్లిని కాదు
రంగులు మార్చటానికి
ఊసే రంగుగా మారిన దాన్ని-
ఎన్నో పడమటి గాలులు
ఎన్నో కొండగాలులు
మరెన్నో తూర్పు గాలుల్ని చూశాను!
ఎన్ని తుపాన్లు నరకం చూపాయి
ఎన్ని హరికేన్లు హింసించాయి
ఎంత వాయు కాలుష్యం చుట్టుముట్టింది
ఎంత ఉష్ణం ఉడికించింది?
అన్నింటినీ జయించాను
వృద్ధాప్యం వరించింది
కాలుడు రమ్మంటున్నాడు
కదనం చేయలేకపోతున్నాను!
రాలిపోయే ముందు
రంగులు ప్రదర్శిస్తున్నాను
ఎరుపుగా నారింజగా
చామనఛాయగా పసుపుపచ్చగా
గోధుమ వర్ణంగా
ఎద ఎదలో దాగటానికి-
మహాప్రస్థానంలో మలుపులు గమ్యాలు
గెలుపులు ఓటములు
అనురాగం - అనుబంధం
ఆత్మీయ రంగులు
మనసు మనసులో ఆవిష్కరించమని
నేలరాలబోయే ఆకుల్తో
నేల రాలబోయే మనుషుల్ని పోటీ పడమని
మనిషి మనిషికి నా సందేశం-
(అమెరికాలో ఆకురాలు కాలంలో
చెట్ల ఆకులు రంగులు మారి కనువిందు చేస్తాయి)
**

- అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946