అక్షర

ఎవరికోసం ఈ అస్తిత్వ రాజకీయాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంబేద్కర్ సామాజిక న్యాయం’
ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి తదితరులు
నవతెలంగాణ
పబ్లిషింగ్ హౌస్
వెల: రు.50
పేజీలు: 112
**

ఏప్రిల్ 14వ తేదీనాడు దేశవ్యాప్తంగా డా.బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతిని జరుపుకున్నారు. ఆ రోజున ఆయన జీవితాన్ని, ఆయన చేసిన కృషిని కొనియాడిన అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారే ఆయన్ని తమ స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. అందుకని అంబేద్కర్ విప్లవ ప్రజాస్వామిక దార్శనికతను, నిజమైన ప్రజాస్వామ్యానికి సామాజిక విమోచన ఆధారం కావాలనే ఆయన సందేశాన్ని ఈ సందర్భంలో పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రకాశ్‌కారత్ తెలియజేస్తున్నారు. పార్టీలు మత విశ్వాసాన్ని మనదేశానికి అతీతంగా వుంచితే మన స్వాతంత్య్రం రెండవసారి ప్రమాదంలో పడుతుంది’ అంటూ సీతారాం ఏచూరి తన పార్లమెంటు ప్రసంగంలో ‘రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న సంఘ పరివార్ చర్యలను’ ఎండగట్టారు. ‘మహిళలను బానిసలుగా చూడాలనుకునే హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కృషి సల్పడమే అంబేద్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి’ అంటున్నారు బృందా కారత్. అంబేద్కర్ వ్యకిత్వంలోను, ఆలోచనలోను వున్న సామాజిక మార్పుకు దోహదపడే అంశాలను ఈనాడు ముందుకు తెచ్చి నిలబెట్టవలసిన అవసరమున్నదని బి.వి.రాఘవులు అభిప్రాయపడుతున్నారు. అంబేద్కర్ కృషిని రాజ్యాంగం రూపొందించడానికి, రిజర్వేషన్లు సాధించడానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదు. ఆయన లక్ష్యమైన కుల నిర్మూలన సాధించడం కోసం అందరం ఐక్యంగా ఉద్యమించడం అవసరమని తమ్మినేని వీరభద్రం తెలియజేస్తున్నారు. అశోక్ ధావలే ప్రజాస్వామ్య లౌకిక వాది, న్యాయ సంరక్షకుడు అంబేద్కర్ అని కొనియాడాడు. ‘మార్క్సిస్ట్ దృక్కోణంలో కులం’ గురించి ప్రభాత్ పట్నాయక్, ‘ఆర్థిక సామాజిక రంగాలలో వర్గ పోరాటం’గురించి ఎస్.వీరయ్య, ‘వర్గ ఐక్యత సాధనకు కుల వ్యతిరేక పోరాటాలు తప్పనిసరి’ అని బి.వి.రాఘవులు తెలియజేసారు. అంబేద్కర్ మళ్లీ జన్మించి దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్లు తొలగించాలని డిమాండ్ చేసినా తాను వాటిని కొనసాగించి తీరుతానని మోదీ చెప్పుకొచ్చారు. బాబా సాహెబ్‌మీద ప్రేమ ఒలకపోయడం దళితుల్ని భారతీయ జనతాపార్టీ వైపు ఆకర్షింపచేయడం కోసమేనన్నది సుస్పష్టం అంటున్నారు ఆనంద్ తెల్‌తుంబ్డే. ఎవరికోసం ఈ అస్తిత్వ రాజకీయాలు? వర్గ పోరాటాల్ని బలహీనపరిచే అస్తిత్వ ఉద్యమాలు అంటూ వివిధ ప్రముఖులు, మేథావులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వున్నాయి. అస్తిత్వవాదంపై కమ్యూనిస్టు వైఖరిని ఎస్.వీరయ్య వివరించారు. సామాజిక రంగంలో అంబేద్కర్ కృషి గురించి , సామాజిక సమస్యల పరిష్కారం గురించి సిపిఎం నాయకులు, మేధావులు, రాసినవ్యాసాలు, చేసిన ఉపన్యాసాలు కొన్ని ఎంపిక చేసి ఈ చిన్ని పుస్తక రూపంలో అందచేసారు. సామాజిక రంగంలో పని చేస్తున్న కార్యకర్తలకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయి.

-కె.పి.అశోక్‌కుమార్