అక్షర

నికార్సయిన హాస్యానికి రికార్డు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టీబ్రేక్’
హాస్య కథలు
డా.మంతెన
సత్యనారాయణరాజు
వెల: రు. 110/-
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
విక్రేతల బ్రాంచీలు
**
‘రసాలన్నింటిలోను హాస్యరసము మేలు’ అంటారు. పండిత పామరులనే తేడా లేకుండా హాస్య రసము అందరినీ అలరిస్తుంది. చిలకమర్తి వారి ‘గణపతి’ని, పానుగంటి వారి ‘సాక్షి’ సంపుటాల్ని ఇప్పటికీ గుర్తుంచుకొనడం ఇందుకు నిదర్శనం. ఇక సమకాలీన సాహిత్యానికి వస్తే ముళ్లపూడి వేంకట రమణగారి ‘రాధా గోపాళానికి’ ఏభై ఏళ్ల పైమాటే. అయినా ఎవర్ గ్రీన్! అనుకుంటాం గానీ హాస్యాన్ని పండించడం ఆంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకనే తెలుగు సాహిత్యంలో నేడు బహుకొద్దిమంది మాత్రమే లబ్ధ ప్రతిష్టులు. వారిలో డా.మంతెన సత్యనారాయణరాజు గారు ఒకరు. ఇంతవరకు వీరు సుమారు 600 హాస్య కథల్ని రాసారు. అవి నాలుగు సంపుటాలుగా వివిధ పత్రికల్లో వెలువడిన అనంతరం కూడా ఆంధ్ర పాఠకుల అభిమానాన్ని చూరగొన్నాయి.
వైద్యుడిగా రోగుల ‘నాడి’ పట్టగలిగిన డా.మంతెన గారు కథా రచయితగా పాఠక లోకపు నాడిపైన కూడా చక్కని అవగాహన ఉంది. అందుకనే ప్రస్తుత కథా సంకలనం ‘టీబ్రేక్’ సంకలనంలోని అన్ని కథలు లోగడ వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి పాఠక లోక ఆదరణకు నోచుకోబడి ఇప్పుడు మనముందుకు సంకలన రూపంలో వచ్చాయి.
రాజుగారి కథలు... ఆది, మధ్య, అంతమూ-హాస్య రస స్ఫోరకమే! కథలకు వీరు ఉంచే శీర్షికలతోనే హాస్య ప్రవాహం ప్రారంభం అవుతుంది. అప్పుచేసి పప్పుకూడుకు పేరడీగా ‘తప్పు చేసి చిప్పకూడు’ ఉంటుంది. ‘వాలి! వాలి! వాలి!!’ అంటే వాలి సుగ్రీవులు కాదు- అప్పనంగా వాలిపోయి, అనుచితంగా, అన్నీ ఉచితంగా ఆశించే సెక్షన్ హెడ్ వాలి. డిస్పాచింగ్ క్లర్కు స్నిగ్ధను వాలి తన కేబిన్‌లోకి అదీ ఆఫీసు అయ్యాక సినిమాకు పిలిస్తే ఆమె భయపడుతుంది. కారణం మనం అందరం ఊహించగలిగేది కాదు ఇద్దరి టిక్కెట్లు చచ్చినట్లు ఆమే తీయాలి. పిక్చరు చూస్తూ నిర్మొహమాటంగా డ్రింకులు తెప్పించమనో, పాప్‌కార్న్ పేకెట్లు పట్టుకు రమ్మనో అడిగే ‘బేవార్సు’ రకం కాబట్టి. ‘అ(కు)క్క మొగుడు’, ‘బావతో భామాకలాపం’, ‘శతభస్మ సుందరుడు’ ‘లవ్వొక్కింతయు లేదు’ లాంటి కథల్లో కూడా గిలిగింతలు, కథా శీర్షికతోనే మొదలవుతాయి.
ఇక రాజుగారు తన కథల్లోని పాత్రలకు నిర్ణయించే పేర్లు కూడా చిరునవ్వులు పూయించే రకం! శ్రీగంథం పంచముఖి ఆంజనేయ ప్రసాదు, లింగ పొట్లకాయ్, వాతాపిరావు, తంబళ్లపెద్ది, గొడ్డిగేదెల దయామణి, అంతే గమ్మత్తయిన పేరుగల ఆమె కొడుకు భల్లూకరావు; గజపాదం గురుపాదంలు తాము పాఠకులకు పరిచయం అవుతునే వినోదం తెస్తారు. వీరి కథల్లోని వాక్యాలు కూడా చమక్కులు చూపుతాయి. ‘తల్లిగారి’ కథలోని నాయకుడు ఆంజనేయ ప్రసాదు. ఆయన, పిన్నిగారింటికి వెళ్లక తప్పదు. ఎందుకంటే ‘పిన్ని కూతురింకోసారి పెద్ద మనిషి కాదు కనుక’! సాయంత్రం స్నేహితుడు మందుకు పిలిస్తే ‘వట్టి మందేనా ఇంకా ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు గాని...(వాలి వాలి వాలి) అంటూ అడుగుతాడు సెక్షన్ హెడ్ కధానాయకుడు. మగాడితో ఏదైనా తెగేదాకా లాగితే ‘వాళ్లు టూటౌన్ (సెకండ్ సెటప్) పెట్టేస్తారు’ (అప్పారావుకు ఆకలేసింది), ‘అ(కు)క్కమొగుడు’లో త్రివేణి భర్త కార్తీకరావు ‘కుక్కలా వాసన చూస్తూ, లక్కలా అంటుకుపోయే’ రకం. ఐరన్‌లెగ్ సుందరానికి ‘శత భస్మ సుందరుడు’ అన్న బిరుదు ప్రదానం చేస్తున్నట్లుగా కలగంటుంది ఆయన భార్య రాగిణి.
టీవీల్లో..‘చిన్న బ్రేక్’ అనో ‘కమర్షియల్ బ్రేక్’ అనో రాగానే...సంతోషిస్తూ మ్యూట్‌లో పెడతాము. కానీ హాస్యకథల ఈ సంకలనం ‘టీబ్రేక్’ చదవడం అయిపోగానే ‘అప్పుడే అయిపోయాయా’ అంటూ విచారపడతాము-హాస్య బ్రహ్మ శ్రీ శంకర నారాయణగారి ముందు మాట ‘నవ్వుల రాజరికం‘ ఈ సంకలనానికే హైలైట్!

-కూర చిదంబరం