అక్షర

మీకు తెలియని మీ హైదరాబాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హైదరాబాదు వారసత్వ సంపద: పిల్లల నుంచి
పిల్లలకు’’
మధువాత్రి, అను: కె.సురేశ్, మంచి పుస్తకం,
వెల: రు.135/-
పేజీలు: 198
**
హైదరాబాదు నగర నిర్మాణం- వారసత్వ సంపద గురించి ఇంతవరకు తెలుగులో సరియైన పుస్తకం రాలేదు. అందుకని రచయిత్రి మధువాత్రి ఎంతో శ్రమించి హైదరాబాద్‌కు సంబంధించిన వాస్తవాలను- కథలను సేకరించి మనకు అందజేస్తున్నారు. కుతుబ్‌షాహీ సుల్తానుల కాలంనుంచి మొదలుకొని 1948లో హైదరాబాదు రాజ్యం స్వాతంత్య్రం పొందేవరకు ఈ నగర కళలు, సంస్కృతి, భవన నిర్మాణశైలిని తీర్చిదిద్దిన అంశాలపై జానపదాలు, వాస్తవాలు, పిట్టకథలు ఈ పుస్తకంలో వున్నాయి. ఇందులో ‘కొహినూర్ కథ’, ‘లంగర్ ఊరేగింపు’, ‘మొఘల్ చక్రవర్తి’, ‘నాదిర్‌షా-మొఘల్ మంత్రి’, ‘గోల్కొండను కాపాడిన కుక్క’వంటి కథలు చదవడం ఆసక్తికరంగా వుంటుంది. అమ్మిన వర్తకుడి పేరుతో చలామణి అవుతున్న ప్రపంచంలోని ఏకైక వజ్రం గురించి, ‘జైహింద్’ అన్నది హైదరాబాద్ వ్యక్తి రూపొందించారన్న విషయం పాఠకుడ్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ కాలక్రమానుగుణంగా అమర్చి హైదరాబాద్ చరిత్రను తెలియజేస్తారు. ప్రతి కథ చివర కొన్ని కృత్యాలు వున్నాయి. ఈ కృత్యాలలో బొమ్మలువేయడం, రంగులువేయడం, క్రాఫ్ట్ పని, నాట్యం, నాటిక, కవిత వంటి వివిధ కళారూపాలు వున్నాయి. వీటివల్ల పిల్లలలో చరిత్ర - సంస్కృతి పట్ల ఆసక్తి పెంపొందించడానికి అవకాశముంది.
హైదరాబాదు నగర భవన నిర్మాణ వారసత్వం గురించి చెప్పకపోతే హైదరాబాదు చరిత్ర అసంపూర్ణంగా వుండిపోతుంది. నగరంలో కడుతున్న నిర్మాణాల చుట్టూ జనావాసాలు ఏర్పడసాగాయి. అది ఈనాటికీ కనబడుతుంది. గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, ఘోడేకి కబ్ వంటివి దీనికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. 1591నుండి 1948 వరకు ఈ రాజ్యం ప్రధానంగా కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు అన్న వంశాల పాలనలో వుంది. హైదరాబాదులోని భవన నిర్మాణశైలి, సాంస్కృతిక వారసత్వంపై ఆయా కాలాల, పాలకుల చెరగని ముద్ర కనబడుతుంది. హైదరాబాద్‌లో ముఖ్యంగా చౌమహల్లా, ఫలక్‌నుమా, ఎర్రమంజిల్, దివాన్‌దేవిడి, మాల్వాలాపాలెస్, యం.జె.మార్కెట్, పత్తర్‌గట్టి, ఆర్కియలాజికల్ మ్యూజియం, అసెంబ్లీలోని పలు భవనాలు, జూబ్లీహాలు, బ్రిటిష్ రెసిడెన్సీ- కోఠి మహిళా కళాశాల ఇలా పలు భవనాలు అసఫ్‌జాహీ ప్రభువుల కాలంలోనే నిర్మాణం జరిగింది. అయితే ఈ పురాతన, చారిత్రాత్మక భవనాలలో చాలాభాగం అనేక కారణాలవల్ల విస్తృతిలోకి జారుకున్నాయి. పోయినవి పోగా, మిగిలివున్న చారిత్రిక కట్టడాల గురించి ఈతరం విద్యార్థులకు, కొత్తవారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఈ గ్రంథాన్ని శ్రీమతి మధువాత్రి ఆంగ్లంలో వెలువరించగా, దాన్ని కె.సురేశ్ సులభశైలిలో తెలుగులో అనువదించారు.

-కె.పి.అశోక్‌కుమార్