అక్షర

జమీందారీ వ్యవస్థకు దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగారవ్వ (నవల)
కన్నడ మూలం: చంద్రశేఖర కంబార
అనువాదం: కె.సురేష్
కావ్య పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ,
ప్రతులకు: మంచి పుస్తకం, నవోదయ,
పుటలు: 176, వెల: రూ.110/-
**
చంద్రశేఖర కంబార గొప్ప పేరున్న రచయిత. జ్ఞానపీఠ బహుమతి గ్రహీత. జానపద సాహిత్య పరిశోధకుడు. నాటక రంగంలో పేరున్న మేటి రచయిత, ప్రదర్శకుడు. దిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన రచనలలో ముఖ్యమయినది ‘శింగారవ్వ మత్తు అరమనె’. అది తప్పకుండా బెంగాలీ ప్రాంతపు యాసలో నడిచి ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్ ఆధారంగా నవలను సురేష్ తెలుగులోకి అను వదించారు. బాగానే ఉంది.
కుప్ప గూలుతున్న జమీందారీ వ్యవస్థ గురించి ఈ నవల మనకు చెపుతుంది. తెలుగులో, అందునా తెలంగాణంలో దొరల గురించిన రచనలు వచ్చాయి. కానీ, ఈ నవల పూర్తి వేరుగా ఉంది. ఇందులోని జమీందారు మీసాలు తిప్పే మొనగాడుకాదు. నపుంసకుడు. అమ్మాయి తొడ కనిపిస్తే మూర్ఛపోతాడు. వీధి నాటకం అతని హాబీ. కనుక అతని పేరు సరిగమ దేశాయి. అటుపక్కన మరొక గౌడ(గౌడు కాదని మనవి!) అత్యాశాపరుడు. ఆస్తికొరకు అందమయిన కూతురిని ఒక శవానికి కట్టబెట్టిన ఘనత గలవాడు. అదే అమ్మాయిని ‘సరిగమ’కు మళ్లీ కట్టబెడతాడు. అక్కడా, యిక్కడా మారెప్ప అనే మరొక పాత్ర ప్రధానంగా మనకు ఎదురవుతుంది. అట్లాగే కథానాయకురాలు సింగారవ్వకు చెలికత్తె శీనింగవ్వ! సింగారవ్వ తీరని కోరికలతో, తప్పని సంప్రదాయాలతో పోరాడి, కడకు తెగించినతీరు ఈ నవలలోని అంశం!
రచయిత, కథను వెతుకుతూ స్వయంగా బయలుదేరతాడు. తమ స్వంత ఊరికే! అక్కడ సింగారవ్వను ఆశ్రయించి కథ చెప్పించుకుంటాడు. మధ్యలో తాను ఎరిగి ఉన్న సంగతులను తానే చెపుతాడు. రచయితగా చంద్రశేఖర కంబారలోని ప్రత్యేకతకు ఈ కథనశైలి నిలువెత్తు నివాళి. అతని మాటలు, (మనం తెలుగులో) చదువుతుంటే, రచయిత వచ్చి చెపు తున్నట్టు ఉంటుంది. (రచనను కన్నడలో చదవగలిగితే ఎంత బాగుంటుందో ఇంక!) మనకు నిశ్శబ్దం ‘చీమ చిటుక్కుమన్నా’ వినిపించేంత ఉంటుంది. ‘ఆవుతోక కదిలించినా వినిపించేంత నిశ్శబ్దం ఈ నవలలో ఎదురవుతుంది. ‘కార్లున్నచోట చెప్పులుంటాయి’, ‘రాళ్లు ఉడికించుకుని, ముళ్లు వండుకుని తినడం’లాంటి మాటలు అక్కడి మాటతీరును ఎదుట నిలుపుతాయి. చింతతోపును వర్ణించిన తీరు, రచయిత పాటవానికి ఉదాహరణ.
పాత్రలను పరిచయంచేసి, వాటిని వర్ణించకుండా కేవలం సంఘటనలు, మాటల ద్వారా వాటి తీరును పాఠకునికి అందించిన తీరు విలక్షణంగా ఉంది. కొన్ని పేజీలు గడిచిన తరువాత పాఠకులు, తానూ శీరింగవ్వ ముందు కూచుని కథ వింటున్న భావనలోకి జారక తప్పదు. కథ గొప్పది. జమీందారీ వ్యవస్థ గురించి చెపుతూనే, మనుషులు-బలహీనతలను గురించి పరోక్షంగా చెప్పిన తీరు సామాన్యమయినది కాదు. ఈ నవలలో స్ర్తి పాత్రల గురించి తప్పక పరిశోధనలు, విశే్లషణలు జరిగి ఉంటాయి. అట్లాగని నవల నిండా ఆడ మనుషులున్నారని కాదు. కథానాయకురాలు సింగారవ్వ, ఆమె చెలికత్తె శీనింగి, సింగారవ్వ తల్లి, ముగ్గురే ఉన్నది! ఇక సరిగమ, గౌడ, మారెప్పలు మరొకవేపు. ఈ నవలను నాటకంగా ప్రదర్శిస్తున్నారు. సినిమా కూడా వచ్చేసింది. అన్నిరకాలుగానూ ఈ రచన సంచలనం సృష్టించి ఉంటుంది.
కనీసం ఇంగ్లీషు ద్వారానయినా, నవల తెలుగులోకి రావడం బాగుంది. సమస్యలు ఉన్నాయి. అయినా నవల బాగుంది! చదివి తీరాల్సిందే!

-గోపాలం కె.బి.