అక్షర

‘పలుకు అన్నం’ లా తయారైన ‘పలుకులమ్మ పదాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పలుకులమ్మ పదాలు’
కె.ప్రభాకర్
26+52+9 పేజీలు;
వెల: రూ.100
ప్రతులకు: కె.విమలారావు
రవి పబ్లిషింగ్ హౌస్,
2ఎల్ 7/4,
థర్డ్‌ఫేజ్, కె.పి.హెచ్.బి.కాలనీ, జెఎన్‌టియు పోస్ట్
హైదరాబాద్- 500 088
9000938291
---

‘పలుకులమ్మ’ అంటే ‘సరస్వతీదేవి’
‘పలుకు అన్నం’ అంటే ‘సగమే ఉడికిన అన్నం’
సంస్కృతం, ఇంగ్లీషులో ఎం.ఏ.లు, సంస్కృతం: ఇంగ్లీషు, నృత్యం, సంగీతంలో ఐదు డిప్లొమాలూ సంపాదించి, ఇంతకాలమూ వచన కవితల్లో 19 పుస్తకాలు రచించిన కె.ప్రభాకర్ ఇకపై గేయ కవితలో కూడా తన ప్రావీణ్యాన్ని చూపెట్టదలచి 20వ పుస్తకంగా బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు యాభై ఏళ్ల పూర్వం జానపద సాహిత్యంనుండి సేకరించిన ఎనిమిది ‘కూనలమ్మ’ పదాల అందచందాలకు ముగ్ధులై ఆరుద్ర వంద పైగా ‘కూనలమ్మ పదాలు’ రాశారు. వారి బాటలోనే మరో 20 మంది కూడా ‘కూనలమ్మ పదాలు’ రాయగా- వాటిని అనుకరిస్తూ రచించినదే ‘పలుకులమ్మ పదాలు’.
‘కూనలమ్మ పదాలు’లో- ప్రతి దానిలోనూ నాలుగు పాదాలు ఉండగా- మొదటి మూడు పాదాలలో పది మాత్రలు ఉండి (గురువులు అనగా దీర్ఘానికి రెండు మాత్రలు లఘువుకు అనగా శ్రీ స్వాతికి ఒక మాత్ర) చివరి పాదం మకుటంతో అలరారుతుంది.
పాత కూనలమ్మ పదాలలో- మొదటి మూడు పాదాలలో పది మాత్రలు చొప్పున సరిగా పోషిస్తూ రచన సాగడంవల్ల అవి అందరికీ వినడానికి సొంపుగా ఉంటాయి. ఈ కూనలమ్మ పదాలను అనుకరింపదలుస్తూ చాలాచోట్ల ఈ రచయిత తప్పటడుగులు వేస్తూ, మూడు పాదాలలో పది మాత్రలు ఉంచి తన సూత్రాన్ని పాటించలేకపోయాడని ఈ క్రింది ‘పలుకులమ్మ పదాలు’ తెలుపుతున్నాయి. చూడండి.
నింగిలో నెలవంక- 10 మాత్రలు
చూసింది నా వంక- 10 మాత్రలు
కునుకు రాదు ఇంక- 9 మాత్రలు
ఓ పలుకులమ్మ
ఊరినిండా బీళ్లు- 10 మాత్రలు
నోటినిండా పళ్లు- 10 మాత్రలు
కంటినిండా కన్నీళ్ళు- 11 మాత్రలు
ఓ పలుకులమ్మా
ఇంకో తప్పు- ‘ఊరినిండా బీళ్లు’ అనే పదం- 3వ పేజీలో ఉండగా మళ్లీ అదే 15వ పేజీలో ప్రచురించటం- ‘పాము చావదు చూడు’అనే పదం- 15వ పేజీలో ఉండగా మళ్లీ 16వ పేజీలో ప్రచురించడం. ‘దాశరథి అనే పాట’ అనే పదం 51వ పేజీలో ఒకదాని క్రింద ఒకటిగా రెండుసార్లు ప్రచురించబడడం. ఎందుకు ఇలా జరిగిందో!? కాని -తెలుగు పుస్తకానికి ఇంగ్లీషులో పరిచయ వాక్యాలు 7వ పేజీలో రాసిన డాక్టర్ అన్నంరాజు సూర్యారావు (తినితి వ పేజీలో డశ్రీ గ్జ అని ప్రచురితమైంది) కవర్ పేజీ డిజైన్ మాత్రం బాగానే ఉంది.

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి