అక్షరాలోచన

ఈ కాలవాహినిలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు తిరిగిరావు
జ్ఞాపకాల దొంతరలు తప్ప
మిగిలిందేమి లేదు
నిరంతర ప్రవాహంలా
నీ దారి నీది.
వొడుదుడుకుల జీవితంలో
ఓటమి గెలుపుల సయ్యాట మాది
ఆశ నిరాశల ఉచ్చుల్లో
ఆత్మక్షోభ మాది.

మొన్నటిలా నిన్న లేదు
నిన్నటిలా నేడు లేదు
రేపటికి రూపం లేదు
యెల్లుండి యేవౌతుందో తెల్వదు
ఈ మాయామయ జగంలో
మాయని గాయాలు తప్ప
చెప్పుకోవడానికేముంది గొప్ప
కనిపించదాయె ముత్యపు చిప్ప.

- రస స్రవంతి, కావ్యసుధ 9247313488