అక్షర

వజ్రాయుధ కవికి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వీరుడు మరణించడు. (వ్యాస సంపుటి)
సంపాదకుడు- శశికాంత్
శాతకర్ణి,
వెల: రు.80/-,
ప్రతులకు- విశాలాంధ్ర బుక్‌హౌస్ వారి అన్ని శాఖలు
**

వెనుకటి తరానికి చెందిన ఒక సాహితీ దిగ్గజం ఇటీవల కన్నుమూసింది. ఆ దిగ్గజమే ఆవంత్స సోమసుందర్. మూడు తరాలకు ఆయన వారధి. తుది శ్వాస విడిచేవరకు కలాన్ని ఆపలేదు. సోసుకి అభ్యుదయ ఉద్యమానికి వేరుచేయలేని బంధం వుంది. అందుకని ‘‘విశాలాంధ్ర’’వారు ఈ వ్యాస సంపుటిని ఆయనకు నివాళిగా ప్రచురించారు.
ఈ వ్యాస సంపుటి ప్రత్యేకత ఏమిటంటే సోసు మరణించగానే వివిధ పత్రికలు రాసిన సంపాదకీయాలు, వివిధ రచయితల సంస్మరణ వ్యాసాలు చోటుచేసుకోవడం. అంటే సోసుపై సద్యఃస్పందనల సమాహారమిది. సోమసుందర్ సాహిత్యయోధుడు అనటంలో విప్రతిపత్తి లేదు. యువతకు స్ఫూర్తి నివ్వటం కూడా విస్మరింపరానిది. ఈ వ్యాసాలన్నీ ఒకచోట కూర్చడంవల్ల సోసును అంచనావేసే అవకాశం ఎక్కువైంది.
చందు సుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, సి.రాఘవాచారి, గొల్లపూడి మారుతీరావు, ఆలూరి విజయలక్ష్మి, రాచపాళెం, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు వంటి పేరుగల రచయితల అనుభవాలు అంచనాలు, జ్ఞాపకాలూ వున్నాయి. అవధానుల మణిబాబు రచన ‘‘వజ్రాయుధ కవితో.. ...’’ విశేషమైనది. ‘‘రాయడం మాట అటుంచి చదవడానికే జీవితకాలం సరిపోనంతగా రాసేసారు. సృజనకోసం వెచ్చించని క్షణాలన్నీ విషఘడియలుగానే భావించార’’ని మణిబాబు ఉన్నమాట పలికారు. తమ నాన్నగారి జ్ఞాపకాలను శాతకర్ణి తెలిపారు. చివర్లో రామతీర్థ, బొల్లోజు బాబాల కవితలు మన హృదయాన్ని పట్టుకుంటాయి.
ఇందులోని వ్యాసాలన్నీ స్తుతిపరమైనవే తప్ప సరిగ్గా అంచనావేసినవి కావనాలి. సోసు నిష్కర్షగా మాట్లాడేవారు. లోలోపల విశ్వనాథవారి పద్యాభిమాని. పైకి మాత్రం విశ్వనాథ ఛాందసుడు’ అనేవారు. ఎన్ని రచనలు ‘రాశి’పోసినా ‘‘వజ్రాయుధ కవి’’గానే ఎందుకు మిగిలారన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఈ వ్యాస సంపుటిలో దొరకదు.
*

-ద్వా.నా.శాస్ర్తీ