అక్షర

ఆసక్తికరంగా సాగిన సంధ్యా రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంధ్యారాగం (నవల)
-పోలంరాజు శారద
వెల: 80 రూపాయలు,
లభించే చోటు: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు.
**
లైబ్రేరియన్‌గా 30 సంవత్సరాల సుదీర్ఘకాలం పుస్తకాల మధ్య గడిపిన శారదగారు పుస్తకం తన నేస్తంగా గడిపారు. ఇటీవలి కాలంలో ముఖ పుస్తకం ద్వారా అనేక పద్యాలు, ప్రహేళికలు, మంచి చారిత్రాత్మక, పౌరాణిక కథలు రాస్తూ మొదటిసారిగా సంధ్యారాగం అనే ఈ సాంఘిక నవల రాశానని చెప్పారు శారదగారు. మొదటి నవలే ఆంధ్రభూమి వార పత్రిక నిర్వహించిన మినీ నవలల పోటీలో బహుమతి గెల్చుకోడం విశేషం.
ఈ నవలలో కథానాయిక సంధ్య.. ఈమె సాంకేతిక విద్య అభ్యసించిన ఆధునిక యువతి అయినా సంప్రదాయాలంటే ఎంతో గౌరవాభిమానాలు కలిగిన యువతి. నవల ప్రారంభంలోనే స్ర్తిలు ఉద్యోగాలు చేయాలా, వద్దా అనే అంశంపై పాత్రల మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగి చివరకు అవసరం లేకపోతే విద్యాధికురాలు అయినా సరే, ఇంటి పట్టున ఉండి పిల్లల్ని, ఇంటిని చూసుకోడంలోనే సుఖం ఉంది అని చెప్తారు రచయిత్రి.
కథానాయిక సంధ్య అలాగే వివాహానంతరం ఉద్యోగం చేయకుండా హాయిగా ఇంటిపట్టున ఉండి మంచి ఇల్లాలిగా తన బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటుంది. విధి వక్రించి భర్త తీవ్రమైన అనారోగ్యంతో అర్ధాంతరంగా మరణిస్తాడు. అయితే కథానాయకుడు తను మృత్యువుకి చేరువ అవుతున్నానని తెలుసుకుని తన భార్య తనని మర్చిపోయి మరో వివాహం చేసుకుని ముతె్తైదువగా బతకాలని ఆమెతో నిర్దయగా ఉంటూ ఆమెకి తన పట్ల విముఖత కలగడానికి విశ్వప్రయత్నం చేస్తాడు.
కానీ, అతనూహించినట్టు అతని మరణానంతరం అతని త్యాగం తెలుసుకున్న కథానాయిక అతను కోరుకున్నట్టు మరో వివాహం చేసుకోకుండా ఓ విధవరాలిగా అత్తగారింటికి వచ్చి అత్త, మామల బాధ్యతను తన భుజస్కంధాల మీదకి తీసుకుంటుంది.
రచయిత్రికి సంప్రదాయాలు, ఆచారాల పట్ల ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయని ఈ నవల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. మంచిదే సంప్రదాయాలని గౌరవించాలి, విలువ ఇవ్వాలి. కానీ, ఎంతవరకు? తన జీవితానందాన్ని త్యాగం పేరుతో నాశనం చేసుకోనేవరకా? ఈ ఆధునిక యుగంలో సంధ్యలాంటి యువతులు ఎందరున్నారు? చందూ లాంటి భర్తలు ఎందరున్నారు? ఉండరు, ఉండాలని ఆశించడం అత్యాశే.. ఆ అత్యాశనే ఆశావహ ధృక్పధంతో ఈ నవలలో వ్యక్తీకరించారు రచయిత్రి. అందుకే పుట్టింట నేర్పిన సంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలు, అత్తింట కూడా చూపి అందరి ఆదరణను పొందిన ఇల్లాలు సంధ్య అని అంటారు నవలలో. అయితే చివరలో అత్త, మామలే కోడల్ని కూతురిగా భావించి అర్ధాంగిని కోల్పోయిన సూర్య అనే యువకుడితో ఆమెకి మరో పెళ్లిచేసి వాళ్ల జీవితాల్ని ముడివేయడానికి సంధ్యని ఒప్పించడం అనే చిన్న మలుపుతో సంప్రదాయాల్లో కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించారు.
తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టుఉన్న ఈ రచయిత్రి భాష ఎంతో బిగువుగా, చక్కగా ఉండి ఆసక్తికరంగా చదివిస్తుంది. మొదటి నవల అయినా చక్కటి ప్రయత్నం.. ముందు, ముందు మరిన్ని మంచి నవలలు రాస్తారని ఆశిద్దాం.

- అత్తలూరి విజయలక్ష్మి