అక్షర

జీవనయాత్ర పరమార్థం.. ప్రతీకాత్మక గేయ కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతిగర్భ
(గేయ కావ్యం)
-ఆచార్య అనుమాండ్ల భూమయ్య,
వెల: రు.50/-, ప్రతులకు- నవోదయ బుక్‌హౌస్,
కాచిగూడ చౌరస్తా,
హైదరాబాద్- 500 027
**
ఆచార్య అనుమాండ్ల భూమయ్య గొప్ప సాహితీవేత్త. పద్య, గేయ రచనల్లో సిద్ధహస్తులు. వీరి కావ్యాలన్నీ విలక్షణమైనవి. నవనవోనే్మషమైన ప్రతిభకు చిహ్న పతాకాలు. ‘‘శాంతిగర్భ’’కూడా అటువంటి విశిష్ట కావ్యమే. ఇది గేయ కావ్యమని కవి అన్నారు. కొంతమందికి ఇవి ‘‘్భమయ్య పదాలు’’గా తోచింది. రెండు పదాలు నిడివిగా గలవి కాబట్టి ద్విపదలా? అనిపిస్తుంది. కానీ మాత్రాఛందస్సులో రాయబడ్డాయి. కాబట్టి ద్విపద గేయాలు అనవచ్చనిపిస్తుంది. సరే, రూప చర్చ అలా వుంచి వస్తువును పరిశీలిస్తే ఈ కావ్యం, నిరంతర చింతనకు సంబంధించినది. ఆత్మావలోకనానికి సంబంధించింది. జీవన యాత్ర పరమార్థాన్ని తెలుసుకోమంటుంది ఈ కావ్యం. ప్రతీకలతో కూడుకొని ఉండటంవల్ల ప్రతీకాత్మక గేయ కావ్యం అనిపిస్తుంది.
‘‘పంచేంద్రియ మిత్రులతో
పగను బూని చెదరునేమొ’’
‘‘బ్రతుకును వేణువుగ మలచి
పాడుకొనుట నెరుగదేమొ’’
వంటివి పరిశీలిస్తే వ్యక్తిత్వవికాస కావ్యం కాబోలు అనుకుంటాం. ప్రతిదీ ఒక తత్త్వప్రబోధమే-
‘‘అహము పెంచి అదియె/ ఆత్మాభిమానమనుకొనో’’ అహం తగు పాళ్లల్లో లేకపోతే గర్వం అవుతుంది. ‘‘అహం వేరు-ఆత్మాభిమానం వేరు’’అంటూ మనసు గతిని తెల్సుకోమంటారు. రామచిలుకను ‘ఆత్మ’గా ‘బుద్ధి’గా, ‘చింతన’గా... ఎన్నిరకాలుగానైనా భావించవచ్చు. పైకి తాత్త్వికపరంగా కనిపిస్తుంది గానీ మానవీయత, సామాజికత నిండి ఉన్న కావ్యం. ‘‘తన్ను తానెరిగినపోబ్రహ్మంబు’’అన్న వేమనకి వ్యాఖ్యానప్రాయమిది.
రచనారీతి మాధుర్యగుణంతో కూడుకున్నది. ఒక మాదిరి విద్యాగంధంగల వారైనా మనసుపెట్టి చదవగల సరళ రచన వుంది. ‘‘మనసులోని మర్మమును తెలుసు’‘’కోమంటున్నారు భూమయ్య. అసలుకవే సాత్వికుడు, తాత్వికుడు ఆ గుణాలే కావ్యంలో ప్రతిబింబిస్తాయి, ఒక్కొక్క ద్విపద ఒక్కొక్క సూక్తిలా వుంటుంది-
‘‘పుస్తకాలె చదివి హృదయ/ పుస్తమునె చదువదేమొ’’
‘‘చిల్లులబొక్కెనతో నీరు/ చేది సొమ్మసిల్లినదొ’’
మానవుడు విజయాలు సాధించినపుడు నా ప్రతాపమే అనుకుంటాడు. విఫలమైతే దేవుని విధిని నిందిస్తాడు. ఇది ప్రాచీనకాలం నుండి ఉన్న స్వభావమే. దీనిని భూమయ్య ‘‘చేతగానితనమును/ విధి చేతికి అంటించునే మొ’’అని వశదపరుస్తారు. అన్నమయ్య కూడా స్వయంగా చేసుకొనడానికి బ్రహ్మనంటే బ్రహ్మ అంగీకరించడు అన్నాడు. నిజంగా జీవితాన్ని గురించి, మనసు గురించి, సృష్టిని గురించి తెలుసుకుంటే భూమయ్య ముగింపు నిజమని తెలుస్తుంది- ‘‘ఆనందము వెల్లివిరిసె/ అమృత ప్రభలు భువిని జేరె’’ ప్రతి పదం తలపదేమొ, లెక్కించునొ, తలచెనొ, చెడెనొ కనదొ....’’వంటి క్రియాపదాలు ఆలోచించమని చెప్తాయి తప్ప శాసించటం కాదు. భూమయ్య కవిత్వానికి వనె్నతెచ్చే కావ్యమిది.

-ద్వా.నా.శాస్ర్తీ