అక్షర

వంశమూలాంకనంలో భట్టరాజుల చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భట్టరాజీయము
- భట్టరాజుల చరిత్ర
రచన: డాక్టర్ కేశవరాజు వెంకట రామరాజు,
వెల: 200రూ.
ప్రతులకు: ఆత్రేయ సాహిత్య సదనము,
4-3-429
బ్యాంక్ స్ట్రీట్, హనుమాన్ టేక్డీ, హైదరాబాదు- 500 001.
**

బంధ యుగమునాటి రామరాజ భూషణ కవికి భట్టుమూర్తి అనే నామాంతరం ఉంది. ఇతడు సంగీత కళా రహస్య నిధి. భట్ట శబ్దమునుబట్టి ఈయన భట్టరాజ కులస్థుడని పరిశోధకులు నిర్ణయించారు. ఆధునిక యుగంలో ఆచార్య బిరుదు రాజ రామరాజుగారు, పుట్టపర్తి సాయిబాబాగారు, డా.రాళ్లబండి కవితాప్రసాద్ వంటి వారు భట్టరాజ వంశస్థులే. వీరు ఎంతటి సుప్రసిద్ధులో వేరే చెప్పనక్కరలేదు. భట్టశబ్దము భట్టారక శబ్ద సంగ్రహరూపము ఇక రాజ శబ్దము చాతుర్వర్ణ వ్యవస్థలో నిక్షతిము వర్ణసంజాతము అంటే భట్టరాజులు రాజులా?! లేక రాజాశ్రయ వర్గములోని వారా అని చర్చ చాలాకాలంగా జరుగుతున్నది. ఈ సందర్భంలో ఒక వైద్యశిఖామణి విపుల పరిశోధన చేసి చరిత్రకాంశములలో భట్టరాజీయము అనే గ్రంథాన్ని వెలువరించారు. ఆయన పేరు డాక్టర్ కేశవరాజు వెంకట రామరాజు. ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి గ్రంథ రచనతో సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. హిందీ భాషలో చారణకాలము ఉంది. భట్టులు మంత్రులుగా దూతలుగా వైతాళికులుగా పనిచేసిన ఆధారాలున్నాయి. వీరికి షోడశ సంస్కారాలున్నాయి. పల్నాటి వీర చరిత్రలోని భట్టరాయబారము సుప్రసిద్ధమే. రచయిత ఈ గ్రంథంలో భట్టరాజు మూలాలలో చాటు వైదిక యుగం నుండి వివిధ వర్ణాల ఆవిర్భావ వికాసాలు సంగ్రహంగా చర్చించారు. పంచద్రావిడ పంచగౌడ బ్రాహ్మణ విభేదాలు సూచించారు. మధ్యయుగంలోని సాంఘిక సామాజిక పరిస్థితులలో ఏర్పడిన కులవ్యవస్థను వర్ణించారు. దక్షిణభారతంలో కంది సూత మాగధ శబ్దాలు, భట్టారక శబ్దం-కుల వాచికములా? మధ్య భారతంలో భట్ శబ్దం వృత్తులా?
బ్రాహ్మణ వంశీయులున్నారు. 239వ పుటలో సర్ హెచ్‌రైజ్లీ, ఆర్ ఎరస్సెల్ వంటివారి పరిశోధనలను ఉటంకించారు.
238వ పుటలో ప్రతాపరుద్రుడు క్రీ.శ.1295 తర్వాత భట్ట వంశీయులను ఉత్తర భారతమునుండి ఓరుగల్లుకు పిలిపించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రంథంలో బడమీసంభట్టు బడబాగ్ని భట్టు (11వ శతాబ్ది) ఒక్కడేనా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఇందులో భట్టరాజవంశీయులైన ప్రముఖులను కథలలో ఉదహరించారు. రామాయణము (సుందరకాండ 58వ సర్గ 159వ శ్లోకం)లో చారణశబ్ద ప్రయోగం ఉంది. ఇది ‘చర’క్రియాజన్యము. అంటేవారు పాటలు పాడుతూ ఆకాశంలో తిరిగే వారని అర్ధం. భట్టరాజులు చారణులు. చాంద్‌బర్దాలూ పృథ్విరాజ్ రాసోచరణ గ్రంథమేనని పరిశోధకుల భావన. కేశవరాజుగారు ఈ గ్రంథంలో ఎనె్నన్నో విషయాలను క్రోడీకరించి ఆధునిక తరానికి తెలియనిది అందించారు. వీరి ప్రామాణిక పరిశోధన మేధను అభినందించాలి. వీరీ గ్రంథమునకు కావలసిన ఉపపత్తులు చూపారు. గ్రంథమును తన పాలకమాతాపితరులకు అంకితమిచ్చారు. భట్టరాజులకు ద్విజస్థితిని కలిగించని కారణమెట్టిది? వారు సాహిత్యమునకే పరిమితమైన హేతువేమి (72వ పుట)అని సంగ్రహంగా రెండు పేరాలలో వివరించారు. ఈ గ్రంథములో కాకతీయ యుగమునకు చెందిన బడబానలభట్టు (రామచంద్రరాజు) పై చిలుకూరి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యానము దాని ఖండవము వంటి వివాదములున్నాయి. ఏ విధంగా చూచినా ఇది భట్టరాజకులస్థులేకాక పరిశోధక విద్యార్థులందరూ చదివి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది.

- ముదిగొండ శివప్రసాద్