అక్షర

వ్యవస్థీకృత విషానికి విరుగుడు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్తవం అండ్ జెన్
మూలం: ఓషో.. అనువాదం: భరత్
మూల్యం: రూ.225/-
ప్రతులకు:
అన్ని విశాలాంధ్ర, నవచేతన
పుస్తక విక్రయ కేంద్రాలలోనూ..
మొబైల్: 9666155555
040-24752801
040-24753218
--

క్రైస్తవం.... కాలకూట విషమా?
జెన్... విషాలకు విరుగుడా??
ఓషో పుస్తకం వ్యవస్థీకృత విషానికి విరుగుడా???
* * *
‘‘ఎవరినుంచి తీసుకున్న ఎలాంటి ఆజ్ఞలైనా, చివరికి ఆ దేవుడి నుంచి తీసుకున్న ఆజ్ఞలైనా మీలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పును తీసుకురాలేవు.’’
‘‘ఎరుక పొందిన వ్యక్తి ఎలాంటి వ్యవస్థీకృత మతానికి చెందడు.’’
‘‘బయటినుంచి నియంత్రించే విధానమంటేనే నాకు అసహ్యం.’’- ఈ మూడు వాక్యాలు ఒకప్పటి రజనీష్- తర్వాతి కాలంలో ఓషో- వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని, తత్వాన్ని మనముందు నిలుపుతాయి. వ్యవస్థలు- నియంత్రణలు- ఆజ్ఞలు వ్యక్తి అస్తిత్వాన్ని పాతరేస్తాయనటానికి ఈ వాక్యాలే అక్షర సత్యాలు. ఈ సత్యాన్ని జీర్ణించుకోలేని ‘అంధులు’ ఓషోపై తిరగబడ్డారు... ఒకానొక కాలంలో ఓషోని వెలివేసారు... అయినా ఓషో వెనక్కి తగ్గింది లేదు... వెనకడుగు వేసింది లేదు.
* * *
ఓషో అంటేనే ముందడుగుకు ప్రతీక... గుండె పొరల్లోంచి పుట్టుకొచ్చే ఒక జీవన స్వరం... అక్షర నాదం... అక్షయపాత్ర. ఉషోదయ కాంతుల ఆశీస్సులతో నిండిపోయినవాడు కాబట్టే ‘‘లక్షలాది ప్రజలు చీకట్లోనే పుట్టి, ఆ చీకట్లోనే అంధులుగా తడబడుతూ జీవిస్తూ, అందులోంచి బయటపడే దారితెలియక ఆ చీకట్లోనే మరణిస్తున్నారు తప్ప వారి జీవితాలలో ఉషోదయ కాంతులు ఉదయించట్లేదు’’అని నిర్భయంగా అనగలిగాడు.
పాతికేళ్లనాడే ఓషో ఎంతో నిర్భయంగా ఇలా అన్నా అంతే నిర్దయతో సమకాలీన సమాజం ఓషోపై కనె్నర్ర చేసింది... అయినా తిరగబడటం మానలేదు... పైగా తన నుండి వెలికి వచ్చే విప్లవ స్వరాలను మరింతగా అక్షరబద్ధం చేస్తూ వచ్చాడు. మతాలకు, నియంత్రణలకు, ఆజ్ఞలకు అతీతంగా ‘‘మీ లోపలినుంచి, మీ స్వానుభవంనుంచి ఉదయించిన ధార్మికత మాత్రమే తాజా గులాబీ పరిమళంలా ఉంటుంది’అనేవాడు. పైగా-
‘‘ఎరుకలో ఉన్నపుడు ఎలాంటి తప్పుచెయ్యలేరు, ఎవరికీ హాని కలిగించలేరు, ఎవరి స్వేచ్ఛనూ హరించలేరు, ఎవరి జీవితంలోనూ జోక్యం చేసుకోలేరు. అంతేకాదు, జీవితం పట్ల మీలో ఎంతో భక్తి, గౌరవ భావాలు ఏర్పడతాయి’’అంటూ భావ స్వేచ్ఛా విహంగ యానం చేస్తూ వచ్చాడు. ఫలితంగా జీవితాన్ని భక్తితోను, గౌరవంతోను బ్రతికించుకునే సమాజం ఓషో అనుచరవర్గమైంది... అర్థం చేసుకోలేని ప్రపంచం ఓషోని కాంట్రవర్షియల్ పర్సనాలిటీగానే పరిగణించింది.
* * *
విప్లవాత్మకమైన మార్పుకు ప్రయత్నించే వాళ్లెవరైనా సమాజం కనె్నర్రకు గురికాక తప్పదు... ఆ కనె్నర్రను ఖాతరు చేయనివారే చరిత్రలో నిలుస్తారు... కనులముందు లేకపోయినా ప్రజల గుండె తలుపుల మాటునుండి పలుకుతుంటారు. అలా ఓషో అక్షరాలు ఈనాటికీ కాంట్రావర్షియల్‌గానే నినదిస్తున్నాయి.
ఇక, ఓషో అంటేనే ‘అవును’ను ‘కాదు’అనగలవాడు... ‘కాదు’ను ‘అవును’ అనిపించగలవాడు. అందుకే మతాలకు అతీతంగా మాట్లాడే ఓషో క్రైస్తవం జెన్ అన్న ఈ పుస్తకంలో క్రైస్తవాన్ని కాలకూట విషంగాను, జెన్‌ను ఆ విషాలకు విరుగుడుగాను చూపించాడు.
‘‘సత్యం గురించి బుద్ధుడు ఏదైనా చెప్పగలడు కానీ, జీసస్ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే, జీసస్ వట్టి భ్రమల్లోనే జీవించాడు.’’ (106)
‘‘సమకాలీన, ఆధునిక మనస్తత్వ శాస్తవ్రేత్తలకు జీసస్ ఒక పిచ్చివాడుగా కనిపిస్తాడు... అవును, జీసస్ నిజంగా పిచ్చివాడే.’’ (106)
‘‘జీసస్ తాను మామూలు మనిషి కాదని, ఆ దేవుని ఏకైక కుమారుడనని నటించేవాడు. అతనెప్పుడూ చాలా ఎత్తులో నిలబడి అందరితో మాట్లాడేవాడే కానీ ప్రతి మనిషి దగ్గరకు వచ్చి పలకరించేవాడు కాదు.’’ (109)
‘‘అన్ని మతాలకన్నా అత్యంత కుహనా మతమే క్రైస్తవమతం... దానితో జీసస్‌కు ఎలాంటి సంబంధం లేదు.’’ (114)
‘‘ప్రపంచ సామాజిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు క్రైస్తవ మతం ఎప్పుడూ వ్యతిరేకమే.’’ (115)

‘‘క్రైస్తవ మతం సింహాలను గొర్రెలుగా మార్చేసింది... మీరు సింహాలై గర్జించాలి. దుఃఖాలను, బాధలను, బానిసత్వాన్ని, అన్నిరకాల దోపిడీలను సమూలంగా నాశనం చెయ్యండి.’’ (123)
‘‘జైన బౌద్ధమతాలు అత్యంత నాగరిక మతాలు... మత మార్పిడి విషయంలో అవి ఏ ఒక్కరినీ చంపలేదు. కానీ ఖచ్చితంగా క్రైస్తవులు మత మార్పిడి విషయంలో అనేకమందిని చంపేసి అన్ని మతాలకన్నా ముందున్నారు. (133)
‘‘జీసస్ ఓడిపోయిన ఒక యూదు, విప్లవకారుడు. శిలువ శిక్ష అనంతరం జీసస్‌ను అతని శిష్యులు గుహనుంచి తీసుకుపోయారు. క్రైస్తవ మతంతో అతనికి ఎలాంటి సంబంధం లేదు.’’ (161)
‘‘క్రైస్తవ మతం ఒక కట్టుకథ. జీసస్ ఎప్పుడూ క్రైస్తవ మతం అనే పేరే వినలేదు. అతను క్రైస్తవ మతాన్ని స్థాపించినవాడు కాదు. ఊరికే దాన్ని అతనికి అంటగట్టారు.’’ (161)
ఇంతటి గాఢ భావజాలం ఓషో ‘‘క్రైస్తవం అండ్ జెన్’’ పుస్తకం నిండా పరచుకుని ఉంటుంది. కైస్తవ మతంపైన ఎనె్నన్నో తూటాలు పేలుస్తుంటాడు... జెన్‌పై ఎన్నో పుష్పగుచ్ఛాలను పేర్చుకుంటూ పోతుంటాడు. అయినా-‘‘క్రైస్తవ మతంతోపాటు, అన్ని మతాల సంకెళ్లనుంచి బయటనడనంతవరకు మనిషి సంపూర్ణుడు కాలేడు. జీవన మాధుర్యపు ఆశీర్వాదాలను ఆస్వాదించలేడు. ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేడు. ఈ మతాలు ఇలాగే కొనసాగితే మానవాళికి పిచ్చిపట్టక తప్పదు.’’ (171)అని అంటూ తన అస్తిత్వాన్ని చాటుకుంటాడు. అందుకే నా దృష్టిలో ఓషో ఒక కాంట్రవర్షియల్ బీయింగ్... ఒక ఎగ్జిస్టెన్షియలిస్టిక్ ఫిలాసఫర్... ఒక కాంటెంపరరీ రెవల్యూషనిస్ట్... మనిషిని మనిషిగా చూపించే ‘మానవతామూర్తి’.
మొత్తానికి, ఓషో ప్రసంగాల సంపుటి ‘‘క్రిస్టియానిటీ ది డెడ్లీ పాయిజన్ అండ్ జెన్ ది యాంటిడోట్‌టు ఆల్ పాయిజన్స్’’అన్న ఆంగ్ల మూలానికి భరత్ అనువాదమైన ‘‘క్రైస్తవం... కాలకూట విషం అండ్ జెన్... విషాలకు విరుగుడు’’ పుస్తకం మనం కోల్పోతున్న జీవితాన్ని కళ్లముందు నిలుపుతుంటుంది... మనం విస్మరిస్తున్న సత్యాలను మన ఎరుకలోకి తెస్తుంటుంది... మనం ఎక్కడ ఆగిపోతే జీవితం స్తంభించిపోతుందో తెలియచెప్తుంటుంది. ‘దేవుడు...దెయ్యం’ ‘దేవుడు... మీకింకా కావాలా?’ వంటి ఓషో పుస్తకాలను తెలుగులోకి తెచ్చిన భరత్ ‘క్రైస్తవం అండ్ జెన్’ పుస్తకం ఓ అందమైన అనువాదం.. అనువాదం అనిపించని రీతిన పుస్తక రచన సాగించిన భరత్ అభినందనీయుడు...

-వాసిలి వసంతకుమార్