అక్షర

అద్దంలో సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంలో మనం
రచయిత్రి: ఎ.ఎస్.లక్ష్మి
వెల:200 రూపాయలు
మధురిమ పబ్లికేషన్స్
ప్రతులకు
మధురిమ పబ్లికేషన్స్
1-24-63,వెంకటాపురం కాలనీ
తిరుమలగిరి పోస్ట్.
సికిందరాబాద్
సెల్ 9490018160
**

మొత్తం సమాజాన్ని అద్దంలో చూస్తే ఎలా ఉంటుంది? ఎ.ఎస్. లక్ష్మి రాసిన ‘అద్దంలో మనం’లా ఉంటుంది. మన చుట్టూ ఉన్న మనుషులే, మనం రోజూ చూసే సంఘటనలే. వాటిని ఒక్కోక్కరు చూసే కోణం ఒకలా ఉంటుంది. ఏ ఒక్కటీ వదలకుండా, ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా అదీ ఇదీ అని కాకుండా అన్నింటిపైనా ఎ.ఎస్. లక్ష్మి వారం వారం ఆంధ్రభూమి వార పత్రికలో రాసిన కాలం అద్దంలో మనం నాలుగవ సంపుటి ఇది. కాలమ్ రాయడం కష్టం, వాటిని పుస్తక రూపంలో తీసుకు రావడం అంత కన్నా కష్టం. ఈ రెండింటిని ఎ.ఎస్. లక్ష్మి చేసి చూపించారు. అద్దంలో మనంలో ఏ ముంది అంటే వాట్సప్ గ్రూప్‌లో రోజూ తెల్లవారు జామున గుడ్‌మార్నింగ్ చెప్పి, రాత్రి నిద్ర పోయే ముందు గుడ్‌నైట్ చెపితే కానీ రాత్రి కాదు అని భావించే చాదస్తం, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కొటేషన్ల వరద మొదలుకొని రామాయణం, మహాభారతంను సిలబస్‌లో చేర్చాలని ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన చర్చ వరకు అన్నీ రాశారు. సరదా విషయాలే కాదు అంత సులభంగా అర్థం కాని జిఎస్‌టి వంటి పన్నుల అంశాన్ని కూడా సరళంగా అద్దంలో మనంలో ఇమిడిపోయేట్టు రాశారు. సింధుకు గుర్తింపు నివ్వడంపై రెండు రాష్ట్రాల అతి, పాకిస్తాన్ ఉరిపై భారత్ జరిపిన మెరుపుదాడి వంటి అంశాలనూ సృజించారు.
మన పండగలు, నోములు, వ్రతాలు తెలియకపోయినా ఉత్తరాది వారి కార్వా చౌత్, భాయి ధూజ్, హోలీపై క్రేజ్ చూపుతున్న నవ తరంపై చురకలు వేశారు. అనకొండలా చిన్న వ్యాపారులను మింగేయనున్న వాల్‌మార్ట్, అమెరికా, ఇండియా, చైనా స్నేహాలు వంటి సీరియస్ విషయాలను సరళంగా సంక్షిప్తంగా అద్దం లో మనం అభిమానులకు పరిచయం చేశారు.
ఇలాంటి కాలం ప్రతి వారం రాయడం ఓ ప్రసవ వేదన లాంటిదే. ఇలా రాసి ఆలా ప్రచురించే సరికి మళ్లీ కళ్ల ముందు వారం వచ్చి కూర్చుంటుంది. ప్రపంచంలో ప్రతి రోజూ ఎన్నో విషయాలు జరుగుతాయి. అవి కాలంలో ఇమిడాలి. అలా ఇమిడే అంశాలనే కాలమిస్టులు ఎన్నుకుంటారు. ముందు కాలమిస్టుకు ఆసక్తి కలిగించాలి. దీనిపై మనం ఏదో చెప్పాలి, కాలంకు సరిపోవాలి అనిపించాలి. ఇది చెప్పినంత ఈజీ కాదు. అయినా వారానికో అంశం దొరక బుచ్చుకోవడం కష్టం కూడా కాదు. చూసే మనసు ఉండాలి. అలా ఎఎస్ లక్ష్మి కళ్లల్లో పడి, మనసుతో ఆలోచించిన 78 అంశాలను అద్దంలో మనంలో బంధించారు. 78 అంశాలకు 32 అంశాలకు ఇంగ్లీష్‌లోనే శీర్షిక పెట్టారు. అంశాన్ని ఎంపిక చేసుకోవడమే కాదు దానికి నచ్చిన శీర్షిక కూడా ఎంతో కొంత కష్టమే. సినిమాలు, అత్యాచారాలు, రాజకీయాలు, నేరాలు, ఉద్యోగ బాధలు, అత్మకథలు, తిక్క పనులు, వైద్యుల కథలు అదీ ఇదీ అని కాదు అన్నింటిపైనే చమత్కారంగా రాశారు. ఎంత సీరియస్ విషయం అయినా సున్నితంగా వ్యంగ్యంగా, హాస్య పూరితంగా చెప్పుకోవచ్చు అని అద్దంలో మనం చెబుతోంది.

-మురళి