అక్షర

మధ్యతరగతి జీవితాల ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరాజు లింగమూర్తి
రచనలు
కథలు - రెండవ సంపుటం
వెల: రూ.175/-
ప్రతులకు: నవచేతన
పబ్లిషింగ్ హౌస్
గిరిప్రసాద్ భవన్,
బండ్లగూడ (నాగోల్)
హైదరాబాద్.
**
ఒకప్పటి ప్రసిద్ధ రచయిత సింగరాజు లింగమూర్తి రాసిన కథలలో కొన్నిటిని, నవచేత పబ్లిషింగ్ హౌస్ వారు ఇంతకు
ముందు ఒక సంపుటిగా ప్రచురించారు. ఇప్పుడు మరో 26 కథలతో రెండవ సంపుటిని విడుదల చేశారు. సింగరాజు లింగమూర్తి గారి కథలలో మధ్యతరగతి ప్రజల జీవితాలు ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా 1950, ’65 నాటి ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఈ కథలలో కనిపిస్తాయి.
రాజకీయ నాయకుల మధ్య ఉండే స్పర్థలను, స్వార్థ చింతననూ ‘కలవని పాయలు’ కథలో చక్కగా వివరించారు. 1969 నాటి ఈ కథలో ఉన్న రాజకీయ వైషమ్యాలు ఈనాటికీ యథాతథంగా వర్థిల్లుతున్న సంగతి గమనించతగ్గది.
‘ఆఖరి రోజు ఆఖరి ఉత్తరం’ కథలో అంకిత భావంతో ఉద్యోగం చేస్తున్న పోస్ట్‌మన్ జీవిత చిత్రణ బాగుంది. రోజురోజుకూ బాధ్యతా రాహిత్యం విస్తరిస్తున్న ఈ కాలంలో, బాధ్యత గురించి తెలిపే మంచి కథ.
కొడుకు చెయ్యని దొంగతనం గురించి ‘నీడ తెగిన మనిషి’లో విశే్లషించిన తీరు ఆసక్తికరంగా ఉంది. నేర్చుకోతగిన అంశాలు ఇందులో కనిపిస్తాయి.
ఒకపక్క కుళ్లు మనస్తత్వాలతో ఉంటూ, పైకి మాత్రం, గొప్పవాళ్లమని చెప్పుకునే వాళ్లను, ఎండగట్టే కథ ‘ఘరానా మనుషులు’.
మనుషుల మధ్య ఉండే ఆర్థిక వ్యత్యాసాల గురించిన విశే్లషణ ‘సంకెళ్లు పడిన వాళ్లం’ కథలో కనిపిస్తుంది. రచయితలోని అంతర్మథనాన్ని ఇందులో చూడవచ్చు. మధ్యతరగతి వాళ్లెవరు? అనేది శేష ప్రశ్న.
సమాజం గురించే కాక, మనుషుల మనస్తత్వాల గురించి కూడ రచయితకు లోతైన అవగాహన ఉందనే సంగతిని ఈ పుస్తకంలోని కథలు తెలియజేస్తాయి.

-ఎం.వెంకటేశ్వర శాస్ర్తీ