అక్షరాలోచన

జీవన పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉషోదయ కిరణాలతో
జీవన పోరాటం మొదలై
తనువంతా చెమటచుక్కలతో నిండి
రెక్కల కష్టంతో... కాడెద్దులతో...
గొర్రుతో నేను మా ఆడది
సాలులో సక్కగా అడుగులేస్తూ
విత్తు విత్తుతూ మేర చేరుకొని
ఎకరాలకు ఎకరాలు విత్తు చేసి
సూర్యాస్తమయానికి గూటికి చేరుకొని
మరుసటి రోజుల్లో... పంట చేనుల్లో...
మొలకెత్తిన విత్తును చూసి
ఆవిరయ్యే కష్టం మాది
మురిసిపోయే మనసు మాది
పంట చేతికందిన నాడు
తెల్లని చీర చుట్టుకుంటుంది
ప్రతి గడప పసుపు కాస్తుంది
ప్రతి ఇంట పబ్బమే
ఇంత జేసినా జానెడు పొట్ట కోసమే...
బిడ్డ పెళ్లిజేసి సాగనంపడం కోసమే...
నాలుగు కాసులు పోగేసేది
నగలు నట్రా
మిద్దెలు మేడలు
కారులు బంగళాలు కొనడం కోసం కాదు
తెలియదు మేము పండించిన
ప్రతి గింజపై ఎవరి పేరు రాసుందో
ఎవరికి ఎవరు ప్రతిఫలం వస్తుందో
మా శ్రమ విలువ కట్టలేనిదని
గుర్తిస్తే చాలు!!

- కుంచె చింతా లక్ష్మీనారాయణ 9908830477