అక్షరాలోచన

రాత్రి బెంగటిల్లుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొక్కొరొక్కో రాగాలు మేల్కొంటాయ
యాంత్రిక లోకంలోకి లాక్కునిపోయే
కొన్ని క్షణాలు
చుట్టూ కాపలా కాస్తుంటాయ

నిద్రని కప్పుకున్న దేహం
సరిహద్దు సైనికుడిలా హుషారవుతుంది
తల దువ్వుకుని నవ్వడమెలాగో
అద్దం ముందు విద్యార్థిలా నిలబడుతుంది

బ్రతుకు నేర్పిన పాఠంలా
ముఖమంత నవ్వు పూయస్తూ
కాలంతో పరుగెడుతుంది

పని గంటల నడుమ నలిగిపోయ
వలలోంచి తప్పించుకున్న చేపలా
ఇంటిముఖాన ఈదుతుంది
చుక్కల గొడుగు ఎత్తిపట్టిన ఆకాశం
వెనె్నల నవ్వు నవ్వుతుంది

భార్యాభర్తల అనురాగంలా
వేన్నీళ్లలో చన్నీళ్లు పోసుకుని
వొళ్లు మల్లెపూవవుతుంది

చుక్కలు లెక్కపెడుతున్నట్టు
వాకిట్లో
చాప పరుచుకుని పడుకుంటుందో
దిక్కులతో మాట్లాడుతున్నట్టు
కుర్చీ వేసుకుని కూర్చుంటుందో

ధారావాహిక ప్రసారంలో
కరెంటు పోయన అంతరాయం
క్యాండిల్ లైట్ డిన్నరులా
కంచం ముందు కూర్చొమ్మని వడ్డించిన
భార్య ప్రేమ కడుపునిండా భోంచేసినట్టు
కురుస్తున్న ఏకాంతంలో
వెనె్నల కావ్యం చదువాలని చూస్తుంది

కాలం వొంపులో
రోజులు దొర్లిపోయన దిగులు
వాన పాములా పాకుతూ వస్తుంది

బ్రతుకు లెక్కలు
కళ్ళెం వొదిలేసిన గుర్రాలవుతాయ
కళ్లముందు పిల్ల పావురాళ్ళు
నోళ్ళు తెరచి మోకరిల్లుతాయ

వెనక్కిరాని కాలాన్ని
ఇంకొంత పగలు దానమివ్వమని
దోసిలిపట్టి అడుగుతున్న ఆకలి కళ్ళలో
రాత్రి బెంగటిల్లుతుంది

- జి. రామకృష్ణ, 8977412795