అక్షరాలోచన

ఏమంటావు సోదరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానగరాలని చూసి మురిసిపోతున్నాం
మనమెంతో ప్రగతి సాధించామని
ముచ్చటపడుతున్నాం
భారతదేశం వెలిగిపోతోందని
భ్రమ పడుతున్నాం
పట్టణాలకు దూరంగా పల్లెలున్నవి చూడు
గిరిజన గ్రామాలను చూడు
కాలిబాటలే కరువైన గ్రామాలను చూడు
రహదారి సౌకర్యాలు
రవ్వంతైనా లేని ఊళ్ళు చూడు
రోగార్తులైన ప్రజల పాట్లు
ప్రసూతి సౌకర్యం లేని పడతుల పాట్లు చూడు
ఆసుపత్రులు అనే్వషిస్తూ
మైళ్ళకు మైళ్లు మంచాలపై రోగులను మోస్తూ
నగరాలకి చేరే జనాలని చూడు
పండిన పంటలను అయన కాడికి అమ్ముకునే కర్షకుల కష్టాలను చూడు
చీకటిలో చిక్కుకున్న గ్రామాలున్నాయ చూడు
నగరంలో సైతం నడిచి వెళ్లే పాదచారుల కష్టాలు చూడు
వాహన చోదకుల వంతలు చూడు
సందులలో, గొందులలో
సంచరించే సూకరాలను చూడు
ముసిరే యశకాలను చూడు
వాటి బారిన పడిన రోగార్తులను చూడు
ఇప్పుడేమంటావు సోదరా?
భారతదేశం వెలిగిపోతోందంటావా?
నిజంగా వెలిగిపోతోందంటావా?
మరేమంటావు సోదరా, చెప్పు!

- ముడుంబ వేణుగోపాలాచార్యులు 9440420379