అక్షర

పిల్లలకు పనికొచ్చే మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలకు చింతకాయలు
(బాలల చిట్టిపొట్టి నవలలు) -దూరి వెంకటరావు
వెల: రు.70/-
ప్రతులకు: రచయత
25-10-30 దాసన్నపేట, విజయనగరం-535002, 9666991929
**
మంచి భావుకత, భాషమీద పటుత్వం వుంటే చెప్పదలచుకున్న విషయాలను మనసుకు పట్టేలా చెప్పే నేర్పు అలవడుతుంది. మూడు దశాబ్దాలకు పైగా రచనలను చేస్తున్న రచయిత దూరి వెంకటరావుగారిది, అయిదు వందలకు పైగా కథలు రాసిన చరిత్ర. అందులో బాల సాహిత్యం కూడా వున్నాయి. వీరి బాల సాహిత్యం, కథలు బాలలకోసం నవలలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రజాదరణ పొందాయి. విజయనగర వాస్తవ్యులైన వెంకటరావుగారు అనేక సేవా కార్యక్రమాలలోను పాలుపంచుకున్నారు. బాలల కథలలోను, నవలలు ‘మంత్రాలకు చింతకాయలు’, మూడు వింతలు, స్వరమంజరి ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేక మార్గంలో నడుస్తూ మంచి సూక్తిని మానవతా విలువలని పిల్లలకి బోధిస్తాయి. పందెం, జ్ఞానోదయం వంటి కథలు పిల్లలను మంచి మార్గంలో నడిపించే నీతి కథలు. మన తెలుగు భాషను అభివృద్ధి చేసుకుంటూ మనకి తెలుగు కథలు చదివే అలవాటు పిల్లల్లో కలగచేయడానికివి అను వైన కథలు. ప్రతీపాపా, బాబు ఈ పుస్తకం ఆసాంతం చదివి తమ స్నేహితులచేత చదివించవలసిన మంచి గ్రంథం.
**

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-శారదా అశోక్ వర్ధన్