అక్షర

విలక్షణ ఆత్మకథా కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పింజారి
షేక్‌నాజర్ ఆత్మకథ
సేకర్త: డా.అంగడాల
వెంకటరమణమూర్తి
వెల: రు.65/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక
విక్రయ కేంద్రాలు
**
‘పింజారి’ పదం దూదేకుల కులాన్ని సూచిస్తుంది. గుంటూరు జిల్లా పొనె్నకల్లు దూదేకుల వారికి ప్రసిద్ధి. వృత్తిపరంగా కాదు వారు సంగీతం, వాద్యం, నాటకం, జానపద కళలు, భజన, వైద్యం మొదలైన వాటిలో ఖ్యాతిగాంచారు. పొనె్నకల్లు దూదేకుల కాలనీలో పందిరి గుంజలు పాటలు పాడుతాయని నానుడి. షేక్ నాజర్ అలాంటి పందిరి కిందే 1920 ఫిబ్రవరి 5న పుట్టారు. ఈ గ్రంథానికి ‘షేక్‌నాజర్ ఆత్మకథ’ అని ఉపమానం చేర్చారు. సేకర్త డా.అంగడాల వెంకటరమణమూర్తి నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘బుర్రకథ పితామహ పద్మశ్రీ షేక్ నాజర్‌‘పై పిహెచ్‌డికి పరిశోధన చేసారు. దానితో ప్రస్తుత గ్రంథానికి సంబంధం లేదు. కారణం డా.రమణమూర్తికి నాజర్ చెప్పిన సంగతులు సంక్షిప్తంగా ఈ గ్రంథంగా రూపొందించారు. దీనిని నాజర్‌గారు చెబుతుంటే నేను రాసుకున్న ఆత్మకథ న్నారు సేకర్త. ఆయన చిత్తశుద్ధికి నిదర్శనంగా ‘దీంట్లో నా సొంత మాట ఒక్కటి కూడా లేదు’ అని ప్రకటించడం విశేషం.
ఈ గ్రంథంలో నాజర్ గురించి, ఆయన చుట్టు అల్లుకున్న అనేక రంగాల విశేషాలు నిక్షిప్తమయ్యాయి. మరెన్నో గ్రంథాలకు, పరిశోధనలకు ఇది కరదీపికగా నిలుస్తుంది. జననం, కుటుంబం, పేదరికం, కష్టాలు,సంగీతం, వాద్యం, శిక్షణ, కళారంగం, నాటకాలు, పాటల రచన, సంసారం, బుర్రకథ, కమ్యూనిస్టు పార్టీ, ప్రజానాట్యమండలి, సినీరంగం, బుర్రకథ రచన, సత్కారాలు, ప్రముఖుల ప్రశంసలు ఇలా ఎన్నో సంగతుల ప్రస్థావన ఈ ఆత్మకథలో చోటు చేసుకుంది. ఆయన మరణం తర్వాత కొన్ని విషయాలు ‘మాబాజీ’ వ్యాసంలో చేర్చారు.
నాజర్ తల్లి బీబాబీ. తండ్రి షేక్‌మస్తాన్. పెద్ద తండ్రి షేక్ నాజర్. ఆయన పేరే పెట్టారు. ‘ఆమ్మా నాన్న ఆరుగాలం ఎండనకా వాననకా అలుపుసొలుపు లేకుండా చాకిరి చేసినా ఆకళ్లు తీరని, అగచాట్లమారి కుటుంబంలో పుట్టాను’. ఇదీ వారి దైన్యస్థితి. కడుపు కూటి కోసం నాజర్ ప్రారంభ దశలో కూలీ పని, కుట్టు మిషన్ పని, సన్నాయి ఊదడం, నాటకంలో చిన్న చిన్న వేషాలు వేయడం, హార్మోనియం నేర్పడం వంటివి చేసారు. నాటకాల కోసం, బుర్రకథ కోసం సంగీతం నేర్చుకున్నారు. కమ్యూనిస్టు భావజాలం వున్న కథలకు బాగా ప్రాచుర్యం వచ్చింది. ఆ పార్టీలో క్రియాశీలంతో పనిచేసారు. జంగాల జాతిలో పుట్టి రామకోటినుంచి ‘నేను కథ చెప్పడంలో మెలకువలే కాదు చాల నేర్చుకున్నాను. పేదలను గౌరవించి ప్రేమించడం, ఆదరించడం, మనకున్న దాంట్లో ఇంత పెట్టడం, ఎన్నో మానవతా లక్షణాలను, కళాత్మక నడవడిని నేర్చుకున్నాను’ అని నాజర్ మనసు విప్పి చెప్పారు. ప్రజానాట్యమండలిలో చేరి వీధి భాగవతాలు, నాటకాలు వేసారు. డప్పుల డాన్సు, కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నారు. ఒక సందర్భంలో సంగీత సాధన కోసం వేశ్యల ఇళ్లలో అన్నం కోసం జోలె పట్టేందుకు వెనుకాడలేదు. బెంగాలు బుర్రకథ, పల్నాటి యుద్ధం, స్వతంత్ర భారతం వంటి బుర్రకథలు, ‘ఆసామి’ మొదలైన నాటకాలు రాశారు. కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం వేధించినపుడు అజ్ఞాతవాసం గడిపారు. జైలుపాలయ్యారు కూడా. ‘వలియ వలియ’, ‘గుమ్మాన యుద్ధ రాకాసి’ వంటి పాటలు మంచి ప్రచారం పొందాయి. ఆయనకు మూడు పెళ్లిళ్లయ్యాయి. 1948లో మూడో పెళ్లయింది. సంతానం ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అనేక సన్మానాలు పొందారు. పద్మశ్రీ అందుకున్నారు. సినిమాల్లో బుర్రకథలు చెప్పారు. నాజర్ భార్య వివరాలు ‘మాబాజీ’గా కలిపారు. అందులో నాజర్‌కు సంబంధించిన విశేషాలు కొన్ని వున్నాయి. ఆయన నైజం గురించి ఎన్నో వివరాలు చెప్పింది. ‘సత్యం చెప్పేవాడికి ఏమీ కాదు. నేను నిజం చెప్పినంత కాలం నాకేం కాదు’ అనేవాడు అని వెల్లడించింది.
నాజర్ ప్రతిభ బహుముఖీనం. తాను చెప్పే బుర్రకథ స్థాయి పెంచేందుకు ఎన్నోన్నో కావ్యాలు చదివిన అధ్యయన శీలి. బుర్రకథకు అసమాన ప్రతిష్ఠ సముపార్జించిన గొప్ప కళాకారుడు. ఆ కళకు పర్యాయపదంగా భాసించిన చిరస్మరణీయుడు. ఇది విలక్షణ ఆత్మకథా కథనం.

-జిఆర్కె