అక్షర

మోదీపై రన్నింగ్ కామెంటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడీ ప్రభుత్వం..
పేట్రేగిన మతోన్మాదం
రచన: సీతారాం ఏచూరి
అనువాదం: కొండూరి వీరయ్య
వెల: రూ.125
ప్రతులకు: నవ తెలంగాణ పబ్లిషింగ్,
ప్రజాశక్తి బుక్‌హౌస్ బ్రాంచీలు.
--

కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వాన బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, రావడానికి పూర్వం.. సిపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
బీజేపీకి, వామపక్షాలకు ఏనాడూ పొసగదు. బీజేపీని ఎలాగైనా దూరం పెట్టడంకోసం చివరికి కాంగ్రెస్ పార్టీతో కూడా చేతులు కలిపిన నేపథ్యం వామపక్షాలకు వుంది. ప్రతి రాజకీయ పార్టీకి మరో పార్టీతో ఒక సైద్ధాంతిక వైరుధ్యం, ఒక సైద్ధాంతిక సారూప్యం వుంటాయనడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు వున్నాయి.
భారతదేశం నేపథ్యంలోనే చూసుకుంటే.. బీజేపీకి రహస్య ఎజెండా ఏమీ లేదు. వామపక్షాలకూ రహస్య ఎజెండా లేదు. ఇరుపక్షాలూ తమ ఎజెండాలను బాహాటంగా ప్రకటించుకునే పక్షాలే. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వంపై సీతారాం ఏచూరిగారి వ్యాఖ్యలు ఏమీ ఆశ్చర్యంగా అనిపించవు. వారి దృష్టితో చూసినప్పుడు చాలా సమంజసంగానే కనిపిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక విధానాలకు సంబంధించినంతవరకూ వారి వాదనతో ఏకీభవించడానికి బలమైన కారణాలు కనిపిస్తాయి. అయితే.. కేవలం హిందుత్వ ఎజెండాతోనే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని, లౌకిక ప్రజాతంత్ర భారతదేశాన్ని అసహనపూరితమైన హిందూ రాష్ట్రంగా మార్చే ఆరెస్సెస్ సైద్ధాంతిక ప్రణాళిక దిశగా భారతదేశాన్ని తీసుకువెళుతున్నారన్న అభియోగం, అందుకు రచయిత చూపిన సాక్ష్యాలు.. అంత బలంగా అనిపించవు.
నిజానికి ఈ పుస్తకం.. ప్రధాని మోడీ ప్రభుత్వ పనితీరుపై విశే్లషణ కాదు. ఎన్నికలకు ముందునుంచి రాసినవి.. బీజేపీకి మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి అని నిర్ణయం అయినప్పటినుంచి రాసినవి. స్మార్ట్‌సిటీల ఏర్పాటు లాంటి ప్రతిపాదనలనూ అడ్డంగా తూర్పారబట్టిన ఈ పుస్తకాన్ని.. భావ సంఘర్షణకోసం అయినా తప్పకుండా చదవాలి.

-ప్రకృతి