అక్షర

మేలు చేయని ‘రహస్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణ రహస్యాలు
ఆచార్య కొత్త సత్యనారాయణచౌదరి
వెల: రూ.120/-
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
అన్ని బ్రాంచీలు
**
రామాయణంపై క్రొత్త కోణంతో దృష్టిసారించి వాల్మీకి రామాయణం ఆధారంగా రామాయణ రహస్యాలు అనే పేరుతో కొత్త సత్యనారాయణచౌదరిగారు క్రొత్త అంశాలను ప్రతిపాదించారు. శ్రీరాముడు సత్యవాక్పరిపాలకుడు కాడు, మాంసాహారము ముట్టనివాడు కాడు, ఏక పత్నీవ్రతుడు కాడు, కపటం లేని వాడు కాడు అని నిరూపించడానికి శతవిధాలా ఈ పుస్తకంలో ప్రయత్నించారు. భారతీయ సంస్కృతికి రామాయణం జీవనాడి. అటువంటి రామాయణంలోను, రామరాజ్యంలోను ఉన్న లోపాలను ఎత్తిచూపారు రచయిత. రాముని చేత ఇంతలేసి మహాకార్యములు చేయించినందుకు రామభక్తులందరు మంధరను అభినందించి ఆమె పేరుతో గుడి కట్టి ఆమె విగ్రహాన్ని పెట్టి హనుమంతుని వలెనే ఆమెను కూడా ఆరాధించాలి అని రచయిత చెప్పారు. ఆధునిక కాలంలో మనము చూచుచుండగా రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యమును, తాను తలచిన కాంత కోసమని విడనాడి విచారపడని ఆంగ్ల రాజ్య కుటుంబములోని వ్యక్తి విండర్స్. ఎడ్వర్డ్-8 కన్నా రాముడెట్లు మిన్నయగును? అని ప్రశ్నించారు. రాముడిని తేనె పూసిన కత్తిగా, మెత్తని పులిగా చిత్రించారు. ధర్మరాజువలె మెత్తని పులి అంటూ ధర్మరాజును కూడా ఇందులో కలిపారు. రామాయణం రంకు, భారతం బొంకు అనే సిద్ధాంతాన్ని ఉదాహరించారు. ‘‘అడవిలోని ఆపదలో దిక్కులేని అక్కుపక్షులైన అన్నదమ్ములకు ఆ పక్షి మాత్రమే సీత జాడ కొంతవరకు తెలిపి సాయము చేసినది (82 పేజీ) అనడం ద్వారా ఎటువంటి పద ప్రయోగాలు చేశారో తెలుసుకోవచ్చు. ప్రసక్తాను ప్రసక్తంగా వశిష్టుడు, ఆంజనేయుడు, పరశురాముల జనన వృత్తాంతాలు, అహల్య, కుంతి మొదలైనవారి పాతివ్రత్యం, పాయసం పంపక విధానం, రామ సోదరుల జననాలను విశే్లషించారు. సుగ్రీవుడు, విభీషణుడు, భ్రాతృద్రోహులనడం, శాస్తక్రర్తలైన శుక్ర బృహస్పతులకన్నా నీచులు రామాయణ పాత్రలలో ఎవరూ లేరని నిరూపించవచ్చును వంటి తీవ్రమైన విమర్శలు చేశారు. రామాయణంలోని వర్ణనలను ఉదాహరిస్తూ, కొన్ని సందర్భాలను పేర్కొంటూ అందులో ఔచిత్యం లోపించిందంటూ సీతానే్వషణం, హనుమత్సందేశము, వాలి వధ మొదలైన వ్యాసాలలో పేర్కొన్నారు. విమర్శ నిస్సందేహంగా స్వీకరించవలసిందే. ఒక విమర్శ చేసే క్రమంలో మరికొన్ని విమర్శలు చేయడం తగినది కాదు. స్ర్తిలను గురించిన సందర్భాలను పరిశీలిస్తే ‘‘్భర్య మాట విని బంగారు లేడి ఉండునని భ్రాంతిపడి పరుగులిడిన వ్యక్తి అవతార పురుషుడై ఈ దేశములో గుడులు గోపురములు కట్టించుకొనుట విచిత్రము’’అని అంటూ ‘‘కనక మృగము...’’ అనే వేమన పద్యంతో సమర్ధించి (4 పేజీ) ఆశ్చర్యపడి ప్రశ్నించారు. కైకను వెంట వైచికొని దశరథుడు దేవాసుర యుద్ధ రంగమునకు పోయెను అనడాన్ని, సీతాదేవి తానుకూడా అడవులకు వస్తాననడాన్ని విమర్శించారు. బ్రాహ్మణులను విమర్శిస్తూ ‘‘గోమాంసము శుచికరము కావున బ్రాహ్మణులకు, గోవులకు ఉన్న సంబంధాన్ని గుర్తించవచ్చు అని రచయిత రుచించిన రీతిలో రచించారు. ‘‘ఆవుల పనులన్నీ ఇతరులు చూడాలట. అక్కరయైనపుడెల్ల వాని మాంసము ఆరగించడము మాత్రము వీరి పని అట’’(31 పేజీ). ‘‘మాంసము లేని విస్తరి, మాంసము పెట్టని నైవేద్యము ఆ రోజుల్లో వుండవన్నమాట రూఢి అయినది’’ (35 పేజీ), ‘‘శ్రుతి స్మృతుల ప్రకారము నడుపవలెనని, నడిచెదనని, చేతికి కంకణము కట్టుకుని వారు దాక్షిణాత్యులవలె మాంసాహారము నిషేధింపగలరా? (38 పేజీ) వంటి ప్రశ్నలు కూడా ఈ పుస్తకంలో వున్నాయి. ఈ సందర్భంలోనే ‘‘బ్రాహ్మణో మమదేవతా’’ అనే వ్యాసంలో శంబుకవధ చేసిన రాముడిని శంబుకులు కూడా పూజించడం విచారించాల్సిన విషయం అనే విభేదాలకు పురికొల్పే మాటలు కూడా వున్నాయి. పురం యొక్క హితాన్ని కోరేవారు, ఎటువంటి విమర్శలనైనా సహనంగా భరించేవారు అనే దృఢ విశ్వాసంతో ఈ విమర్శలు చేసి వుండవచ్చు. ప్రజలలో భక్తివిశ్వాసాలు సన్నగిల్లడం ద్వారా సమాజానికి కలిగే మేలు ఏమిటో సత్యమార్గ బోధకులకే తెలియాలి.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ