అక్షర

బంగారంలాంటి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిడి మనసులు
(కథాసంపుటి)
-సి.ఎస్.రాంబాబు
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
202, కీర్తన హోమ్స్
11-1-530, మైలార్‌గడ్డ
సీతాఫల్‌మండి,
హైదరాబాద్-61
**
ప్రసిద్ధ కథా రచయిత సి.ఎస్. రాంబాబు రాసిన ఇరవై కథలతో ఈ కథాసంపుటి వెలువడింది. వర్తమాన సామాజిక అంశాలతో ఉన్న ఈ కథలలో వస్తు వైవిధ్యం బాగా ఉంది.
ఆగస్టు పదిహేనవ తేదీన జెండా ఎగరవేయటం అనేది మొక్కుబడి వ్యవహారంగా మారిన సంగతిని, ‘మేరా భారత్ మహాన్’ కథ గుర్తు చేస్తుంది. మన పని మనం కరెక్టుగా చెయ్యాలి తప్ప, సోమరిపోతుల్లా ఉండకూడదు అనే మంచి సందేశాన్ని ఈ కథ ఇస్తుంది. మన వల్ల సహాయం పొందిన వ్యక్తి, ఎల్లకాలం కృతజ్ఞత చూపిస్తుండాలని కోరుకోవటం మంచిది కాదనే సంగతి ‘వౌనం మాట్లాడింది’ కథలో ఆసక్తికరంగా తెలిపారు.
తల్లి దగ్గరున్న డబ్బు తీసుకోవాలన్న ఆలోచన తప్ప, ఆమె శేష జీవితం గురించి ఆలోచించని కొడుకుల మనస్తత్వాలను ఎత్తి చూపే కథ ‘కాల ధర్మం’. చాప కింద నీరులా విస్తరిస్తున్న, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల, ఇక్కడి మనుషుల మనస్తత్వాలలో వస్తున్న మార్పులను ఈ కథలో చూడవచ్చు. కథ బాగుంది.
అంకిత భావంతో పనిచేసే, అసలు సిసలు కార్మికుడి మనస్తత్వాన్ని తెలిపే కథ ‘రుణానుబంధం’ ప్రశంసనీయంగా ఉంది.
వ్యవసాయం చేసే రైతుకు, తన పొలం అమ్మాల్సి వచ్చినపుడు కలిగే బాధను ‘పితృణం’ కథలో వివరించారు.
పుస్తకంలోని మిగతా కథలలోనూ పాఠకుడిని ఆలోచింపజేసే మంచి అంశాలు కన్పిస్తున్నాయి.

-ఎం.వి.శాస్ర్తీ