అక్షర

కథా పరిమళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిమళా సోమేశ్వర్ కథలు

వెల: రూ.280/-
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
కేంద్రాలలో
**
1960 నాటికన్నా ముందు కాలంలో తెలుగులో పత్రికల సంఖ్య పరిమితంగా ఉండేది. క్రమేణా పాఠకుల సంఖ్య పెరిగింది. కొత్తకొత్త పత్రికలూ పుట్టుకొచ్చాయి. రచయిత్రులు కూడ ఎక్కువయ్యారు. ప్రత్యేకంగా స్ర్తివాదం అనే ధోరణి నవలంబించిన వారిలో పరిమళా సోమేశ్వర్ ఒకరు.
1965-75 నాటి పరిస్థితులను చిత్రిస్తూ పరిమళా సోమేశ్వర్ రాసిన 42 కథలతో ఈ కథాసంపుటి వెలువడింది. ఈ కథలన్నీ నలభై సంవత్సరాల కిందటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. అప్పట్లో స్ర్తిల పట్ల చిన్నచూపు అనేది, ఒకింత ఎక్కువగా ఉండేదనే సంగతి తెలిసిందే. ఈ సంపుటిలోని ‘రచయిత్రి కథ’ ఈ విషయాన్ని స్పష్టపరుస్తుంది. కథ బాగుంది.
ఒక పత్రికలో వచ్చిన సీరియల్ చదివిన పాఠకురాలు, రచయిత్రి గురించి ఊహించటం, ‘రంగుల కల’ కథలోని ఇతివృత్తం. కష్టపడి అడ్రసు వెతుక్కుంటూ వెళ్లిన పాఠకురాలికి, ఒక సామాన్య స్ర్తిగా రచయిత్రి దర్శనమీయటంతో తెల్లబోతుంది. ఇంద్రధనస్సుతో తనను పోల్చుకుంటూ రచయిత్రి పాత్ర చెప్పిన సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.
‘కవిపత్ని’ కథలో, కవిగారు స్ర్తిల అంగాంగ వర్ణనలు చెయ్యటం తట్టుకోలేని భార్య కనిపిస్తుంది.
కథలు రాసే భార్య కారణంగా భర్తకొచ్చిన కష్టాలు ‘రచయిత్రి భర్త’ కథలో సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి.
**

-ఎం.వి.శాస్ర్తీ