అక్షర

సహజ ఉపమానాలు.. ఆణిముత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంచనపల్లి చిన
వెంకట రామారావు
కథలు
వెల: రూ.40/-
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
న్యాయ శాస్త్రంలో పట్టా పొంది, కామ్రేడ్ల తరఫున ఉచితంగా న్యాయ స్థానంలో వాదించి కాంచనపల్లి చిన వెంకట రామారావు అభ్యుదయ రచయితగా ఒకనాడు ప్రసిద్ధులయ్యారు. ఆంధ్ర మహాసభలలో పాల్గొనటం, నిజాం దుష్ట పరిపాలనను నిరసించడం, జైలుకి వెళ్లడం, శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం.. ఇవన్నీ కాంచనపల్లి కథలకి నేపథ్యాలు. అప్పటి సమాజమే ఆయన కథలకు వస్తువు అయింది. రాజకీయాలలో విలువల కోసం పరితపించిన కాంచనపల్లి రాసిన తొమ్మిది కథలు ఇందులో ఉన్నాయి.
‘తెలంగాణా రైతాంగ విప్లవ పోరాటంలోని వివిధ దశలతో ఉడతాభక్తి సంబంధం ఇంతో అంతో నాకు కూడా ఉంది. ఈ కథానికల్లోని వివిధ సన్నివేశాలు నా కళ్ల ముందు జరిగినవి. ఆయా పాత్రలు నాతో కలిసిమెలిసి మమేకంగా వున్నట్టివి. ఆయా ఘటనలు నన్ను ఉత్తేజపరిచాయి, స్పందింపజేసాయి’ అని కాంచనపల్లి స్వయంగా పలికారు. అందుకే ఈ కథలు మనల్ని నిద్రపోనివ్వవు. తిరుగుబాటు అవసరం ఉన్నంతకాలం ఈ కథలు సజీవమైనవే. ‘మన ఊళ్లో కూడానా?..’ అనే మొదటి కథే తిరుగుబాటును సూచిస్తుంది. ఊరూ వాడా నిజాం కాలంనాటి పీడితులు పిడికిలి బిగించారంటే అందుకు దారి తీసిన కొంత వాతావరణం ఈ కథల్లో గమనిస్తాం. తెలంగాణ తెలుగుతో, సముచిత సహజ ఉపమానాలతో ఆణిముత్యాల కథలు అనిపిస్తాయి. నిజాం కూడా మంచివాడే.. అనే వారు తప్పక చదవవలసిందే. ఇంతకాలానికి వీటిని వెలుగులోకి నవ చేతన పబ్లిషింగ్ హౌస్ వారు తీసుకొచ్చారు.

-ద్వానా శాస్ర్తీ