అక్షర

నాన్నకు నిలువెత్తు నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నకావాలి
(దీర్ఘ కవిత)
ఎస్.సుమిత్రాదేవి
పేజీలు: 48;
వెల: 50 రూపాయలు
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
సలీంనగర్, మలక్‌పేట, హైద్రాబాద్-36
**

సాధారణం గా అమ్మ గురించి అందరూ కవితలు రాస్తారు. నాన్న గురించి కూడా రాస్తారు కానీ నాన్న గురించి చిన్ని కావ్యం లాంటి ఈ దీర్ఘకవిత మనకు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అంతేకాదు, ఈ దీర్ఘకవిత చదివిన ప్రతి ఒక్కరికీ వాళ్ళ నాన్న గుర్తుకు రాక మానడు.
సుమిత్రాదేవిగారు తన తండ్రి గురించి ‘నాన్న కావాలి’ అన్న దీర్ఘకవిత తన తండ్రిని వివిధ కోణాల్లో ఆయన ఆత్మీయతను, అనురాగాన్ని చిత్రించారు. తల్లి తనకు జన్మనివ్వవచ్చు. కానీ ‘అమ్మ బొజ్జనుండి నాన్న గుండెల పైకి మార్చుకున్న మజిలీ ఎంత గొప్పదో ఆమె వర్ణించింది.
నాన్న పట్ల ఆమె మమకారం ఎంత గొప్పదో!
నాన్న ఒక కొండ శిఖరం, నాన్న ఒక స్ఫూర్తి తేజం
నాన్న ఉంటే ఆత్మస్థైర్యం’’
తల్లి నించి ప్రేమను, తండ్రి నించి ధైర్యాన్ని పిల్లలు పొందుతారట! ఆమె తండ్రిని అనుక్షణం అనుశీలించింది. పరిశీలించింది. ఒక తండ్రి గురించి తెలుసుకుంటే ప్రపంచంలోని తండ్రులందరి గురించి తెలుసుకున్నట్లే కదా!
కార్మికుడయినా, ధార్మికుడయినా, దొంగైనా, దొరైనా
నాన్న చెమట భాష్యం, కుటుంబ జీవన వేదం!’’ అని తండ్రిని రూపుకట్టింది.
ఆమె నాకు ఏమీవద్దు. ఆస్తులొద్దు, అంతస్థులు వద్దు, ఆత్మీయతను పంచే నాన్న వుంటే అంతకుమించి యింకేమి కావాలి? అంటోంది.
భూగోళం అన్ని బొమ్మల్ని బహుకరించినా
అవనీ వద్దుగాక వద్దు/ పుడమి తల్లి పచ్చని చిరునవ్వులాంటి
నాన్న కావాలి! నాన్న కావాలి! అని కోరుతోంది.
సుమిత్రాదేవి భాష, భావన కాంతులవుతున్నాయి. ఆత్మీయ వస్తువు కాబట్టి ప్రవాహ సదృశంగా వుంది శైలి. అందరూ చదివి తెలిసిన తండ్రితో తెలియని కోణాల్ని దర్శించవచ్చు.

-సౌభాగ్య