అక్షర

కొంత సమాచారం కొత్తగా దొరికింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్ర, కలలు- పీడకలలు, మెలకువ
-లంకా శివరామప్రసాద్
పేజీలు: 150, వెల: రూ.150/-
ప్రతులకు: రచయిత: సృజనలోకం,
ప్రశాంతి హాస్పిటల్, శివనగర్,
వరంగల్- 506002
ఫోన్: 8897849442
--

ఈ రచయిత, అనువాదకుడు అనుభవంగల వైద్యుడు. నిపుణుడు, సర్జరీలో పేరుగల ప్రొఫెసర్. ఈయన వరుసబెట్టి చాలావేగంగా పుస్తకాలు వెలువరిస్తున్నాడు. ఇంతకుముందే స్వప్నశాస్త్రం అని ఒక పుస్తకం రాసి ప్రచురించారు. అవును ఈయన తన పుస్తకాలను తానే పబ్లిష్ చేసుకుంటారు. మొదటి పుస్తకం ఆరునెలల్లో అమ్ముడయింది. అందుకని స్వప్నశాస్త్రం రెండు రాసి పడేశారు.
రాయడం చేతగావాలే గానీ, ఇంటర్‌నెట్‌లో కావలసినంత సామాను. 150 పేజీల ఈ పుస్తకంలో 60 పేజీలకు పైన నెట్‌నుంచి తీసిన బొమ్మలున్నాయి. నిద్ర, కలలు గురించి కొంత సమాచారం కొత్తగా దొరికింది గనుక ఈ రెండవ పుస్తకం వేశారనవచ్చు. ఈసారి నిద్ర, కలల గురించి పడమటి పాత కవుల అనువాదాలు కూడా దొరికినాయి. కనుక అవి కూడా పుస్తకంలో ఉన్నాయి.
ఒకచోట, వారపత్రిక పద్ధతిలో ప్రశ్నలు సమాధానాలున్నాయి. ఆ ప్రశ్నలు ఎవరు అడిగితేనేమి, జవాబులతోగదా పాఠకులికి పని! సరదా అనుకుని చదవగలిగితే సరే. రచనలో ఒక పద్ధతి లేదు! నిపుణుడు అయిన రచయిత మరింత శాస్ర్తియంగా కలలు, నిద్ర గురించి విపులంగా వివరిస్తే అందరికీ బాగుంటుంది.

-గోపాలం కె.బి.