అక్షరాలోచన

విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతమైన నా పయనం
అలుపు లేకుండా సాగుతూనే ఉంది
గెలుపు తీరాలను శోధిస్తూ!
నిరంకుశ బంధనాలను ఛేదిస్తూ

కష్టాల ముళ్లపొదలను తొలగించుకుంటూ -
చెట్టు, పుట్టల నడుమ రాళ్ళబాటపై
నిష్టాగరిష్ఠుడనై నిరంతర యానం చేస్తున్నా
నా అనే్వషణ ఫలించలేదు
విజయ తీరం కానరాలేదు

నిరాశా నిస్పృహలు ఆవరించి
జీవన పోరాటంలో
ఓడిపోతాననే వెరపు కలిగినప్పుడల్లా
ఒక ఆత్మీయ స్పర్శ నన్ను ఓదార్చి,
ముందుకు నడిపిస్తూ -
నాలో కొత్త ఉత్సాహం నింపుతుంది
బహుశః అది నా అంతరంగాన్ని అల్లుకున్న
ఆశాలత కావచ్చు.

రగులుతున్న గాయాలను
రాగాలు పలికే గేయాలుగా మలచుకొని
జయకేతనం చేబూని
జవనాశ్వమై పరుగులెత్తాను
విజయ శిఖరం మరీచికను మరిపిస్తుంది
విసిగి వేసారి వెనుదిరిగితే -
నేను వచ్చిన దారంతా పూల తివాచీలా కనిపించి,
ఇరువైపులా చెట్ల కొమ్మల్లోంచి కిలకిలారావాలు మంగళవాద్యాల్లా వినిపించాయ
అంతర్నేత్రం ముందు
అసలు నిజం ఆవిష్కృతమైంది
ఆగితే అపజయం
సాగితే విజయం
గెలుపు నా గమ్యం కాదు
ఓటమి నాకవరోధం కాదు
అవి రెండూ నా యాత్రలో నా సహచరులు
నేను మాత్రం విజేతనే!

- బలభద్రపాత్రుని ఉదయశంకర్