అమృత వర్షిణి

స్వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడి కళ్లల్లోకి సూటిగా చూడు
బుల్లి బుల్లి రెప్పల వెనుక స్వప్నాలు
పావురాళ్లలా ఎగురుతుంటాయ్
చిన్ని పెదాల మధ్యన నవ్వులో
వేలాది ఇంద్ర ధనుస్సులు వెలిగిపోతుంటాయ్
ముద్దు ముద్దు మాటల్లో
కాలం మైమరచి కరిగిపోతుంది
బుగ్గకి బుగ్గని జతచేస్తూ
పసివాడినోసారి పొదివి పట్టుకు చూడు
పులకించిన దేహమంతా
పునరుత్తేజమయ్యే ..అనుభూతి
పేరొకటి పెడితే ప్రేమ థెరపీ
నిజం చెప్పినప్పుడు నిర్భయం ఎలా వుంటుందో
మాయలేని మాటల్లో తీయదనం ఎంత ఉంటుందో
అహం నిండని ఆటల్లో ఆనందం ఎవరికి దక్కుతుందో
మనిషి ఒక్కసారైనా
పసివాడితో కాస్సేపు కాలాన్ని గడపాలి
నడిచి వచ్చిన దారుల వెంట వెనక్కి వెళ్ళయనా...
తప్పులు దిద్దుకునే తలపుల్లోకి మళ్లాలి
పెరిగి పెద్దవ్వడం అంటే... మంచి చెడ్డవ్వడం కాదని
ముసుగులు తీసిన తన ముఖంలోకి తానే తొంగిచూడాలి
పసివాళ్ళలో దేవుడుంటాడన్నది నిజమో కాదో గానీ...
మనుష్యులంతా పిల్లలయ్యుంటే...
భూమి స్వర్గాన్ని మించిపోయుండేది.

- గరిమెళ్ళ నాగేశ్వరరావు, 9491804709