అక్షర

వస్తు వైవిధ్యంతో రూపుదిద్దుకున్న ‘నేను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను’’
కవితా సంపుటి
పేజీలు: 90,
వెల: రూ.60/-
ప్రతులకు: ఎన్నవెళ్ళి
రాజవౌళి,
రిటైర్ట్ హెచ్.ఎం.
తడ్కపల్లి గ్రా.,
జి.సిద్దిపేట- 502114, 9848592331
**

వేరువడ్డది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
మనుషులు, మనసులు కాదంటూ.. చక్కని ఆలోచనలతో కవి ఎన్నవెళ్ళి రాజవౌళి ‘‘నేను’’ కవితా సంపుటిని వెలువరించారు.
యాస వేరైనా తెలుగు భాష ఒకటే... భావ ఝరై... హృదయాలను తడిపేందుకు... కృష్ణమ్మ, గోదావరులు ఉండనే ఉన్నాయన్న భరోసానిస్తూ... రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారమంతా ఒక్కటేనన్న భావనను ప్రకటించడం ప్రశంసనీయం!
సాహితీ శిల్పి, కథల తాతయ్యగా పేరొందిన రాజవౌళి బాలల కథలు అనేకం రాసి అందరి మెప్పు పొందారు... లోగడ ‘పూర్ణాంగి’ కవిత సంపుటిని వెలువరించి నప్పటికీ... ఇప్పుడు ‘‘నేను’’ గ్రంథాన్ని పూర్తి స్థాయిలో ప్రకటించారు.
ఇందులో వస్తువైవిధ్యంతో అరవై అయిదు కవితలు కొలువుదీరాయి! అయితే... కవిత్వాంశ కోసం వెతికే పాఠకులు కొంతమేరకు నిరాశపడినప్పటికీ... కవియొక్క సామాజిక చింతనను అభినందించి తీరుతారు.
కథనై నేను
వినే విద్యార్థుల కళల్లో
వెలుగునై తానంటూ... ‘‘నేను’’ కవితను ఎత్తుకున్న తీరు బాగుంది.
పాటనై నేను.. పాడే పాపల పెదాలపై పదాలనై తాను అంటూ కొనసాగించారు. చిన్నారుల నవ్వుల్లో నవ్వునై వికసిస్తానని కాంక్షించారు.
ఆచార్య వృత్తికే వనె్న తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఓ కవితలో.. తాత్త్విక శిఖామణిగా అభివర్ణించారు.
‘‘ప్రకృతి రోదన’’ కవితలో.. ప్రకృతి పతనమైన గతులు తప్పు నీశృతి అంటూ హెచ్చరించారు. వసంతుని ఆగమనమున... గత వైభవము ఎల్లడెల వ్యాపించ.... హృదయాలు రంజింప.. కుహుకుహుమంటూ కూయనే ఓ కోయిలా అంటూ నవ వసంతానికి స్వాగతం పలికారు.
‘‘తెలుగు తల్లికి చీర’’ కవితలో... చక్కని భావుకతను ప్రదర్శించారు.
మరో కవితలో.. ముఖంపైముడతలొచ్చాయని దిగులెందుకు? అనుభవాల మడతలు అందించడానికి ఆనందించుమని హితవు పలికారు.
పల్లెచుట్టు ప్రకృతికి తంగేడుపూల సోయగంతో... అలంకరించే బతుకమ్మ సంబరాలను ‘‘సామ్రాజ్ఞి’’ కవితలో దృశ్యమానం చేశారు.
కవికి విద్యారంగంలో అనుభవం, బోధనతో అనుబంధం వుంది కనుక బడికి ముడిపడి వున్న కొన్ని కవితల్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. ‘అల్లరి’, ‘నాలుగు’, ‘నవ్వు’, ‘సంసారం’, ‘మానవులు’ తదితర కవితలు సూక్తులు, హితోక్తులు, సామెతలుగా రూపుదిద్దుకున్నాయి! వీటిని చక్కని కవిత్వాంశతో తీర్చిదిద్దితే బాగుండేదన్న భావన పాఠకుల్లో వచ్చే అవకాశముంది... వస్తు ఎంపికలో చూపిన శ్రద్ధ, అభివ్యక్తిలోను, చూపితే... రాజవౌళిగారు కవిగా అందరి మన్ననలు పొందగలరు...

-దాస్యం సేనాధిపతి