అక్షర

లెక్కలతో సరదా కబుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణితంతో వినోదం
మూలం: యాకోవ్ పెరెల్మాన్
అనువాదం: పి.రాజేశ్వరరావు
పుటలు: 118
వెల: రు.80/-
ప్రతిభ పబ్లికేషన్స్
ఫోన్స్: 8096314553, 8978672660
**

యాకోవ్ పెరెల్మాన్ పేరున్న సైన్స్ రచయిత. ఎన్నో పుస్తకాలు రాసి, సైన్సును అందరికీ అందించాడు. నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం పేరుతో అతని రచన తెలుగుపాఠకులకు కలకాలంగా తెలుసు. అయితే ఆ పుస్తకానికి అతను పెట్టిన పేరు తెలుగు ఫ్రచురణ కర్తలు మార్చారు. పెరెల్మాన్ ప్రతి అంశాన్ని సరదాగా వివరించడానికి ప్రయత్నించాడు. మంచి ఫలితాలను సాధించాడు. అతను గణితం గురించిన రాసిన పుస్తకం ఇప్పటికీ తెలుగులో రాలేదంటే ఆశ్చర్యమే! ఇప్పటికైనా వచ్చింది సంతోషం!
లెక్కలంటే భయపడేవారి భయాన్ని ఈ పుస్తకం పోగొడుతుంది అంటున్నారు. ఇందులో గణితంతో తమాషాలు, కొలతలు, తూనికలు లెక్కించడంలో సులభ మార్గాలు, రాక్షసి సంఖ్యలు కనిపిస్తాయి. మొత్తం పదకొండు విభాగాలలో 135 అంశాలున్నాయి. ఇంగ్లీషు పుస్తకంలో, చిక్కుప్రశ్నలకు సమాధానాలను ఎక్కడికక్కడ విభాగాల ప్రకారం ఇచ్చినట్టున్నారు. తెలుగు పుస్తకంలో మాత్రం జవాబులన్నీ చివరిలో ఒకేచోట ఇచ్చారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను సరిగా అర్ధం చేసుకోవాలంటే గణితంతో కొంత లోతైన పరిచయం వుండడం అవసరం అనిపించింది. జాగ్రత్తగా చూస్తే ‘మంచిమాట’ పేరుతో రాసిన ముందు మాటలో ఆ హెచ్చరిక కనిపించింది.
ఆసక్తి కలవారు ఈ పుస్తకంతో కావలసినంతసేపు కాలక్షేపం చేయవచ్చు

-గోపాలం కె.బి.