అక్షర

అందరికీ పనికొచ్చే హోమియో వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోమియో వైద్యం
(రెండవ భాగం)
డా.కె.జి.కె.శాస్ర్తీ
వెల: రు.300/-
ప్రతులకు:
దుర్గా పబ్లికేషన్స్,
హైద్రాబాదు
**
హైదరాబాద్ జయసూర్య హోమియో కాలేజి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డా.కె.జి.కె.శాస్ర్తీ, 1994లో పదవీ విరమణ చేశారు. హైదరాబాద్‌లో శంకరమఠం దగ్గర, చాల కాలంనుండీ క్లినిక్‌తోపాటు రిసెర్చి విభాగం కూడ నిర్వహిస్తున్నారు.
హోమియో వైద్యంలో అపారమైన అనుభవం గడించిన డా.కె.జి.కె.శాస్ర్తీ, తన అనుభవాలను తెలియజేస్తూ, ‘హోమియో వైద్యం’ పేరుతో ఒక పుస్తకాన్ని ఇంతకుముందు ప్రచురించారు. ఆ పుస్తకం విశేష ఆదరణ పొందటంతో, దానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘హోమియో వైద్యం- రెండవ భాగం’ విడుదల చేశారు.
ఈ రెండవ పుస్తకం హోమియో వైద్యానికి సంబంధించిన ‘ఎడ్వాన్స్‌డ్ కోర్సు’లాంటిది. పుస్తకం నిండా కేసు రిపోర్టులనేకం ఉన్నాయి. క్లిష్టమైన కేసులలోనూ, హోమియో మూల సూత్రాలకు అనుగుణంగా, సరియైన మందును వెతికి పట్టుకొని, విజయం సాధించవచ్చని ఈ కేసు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వైద్య విద్యార్థులు తమ పరిశీలనాశక్తిని పెంపొందించుకోటానికి ఇవి తోడ్పడుతాయి. కేసు రిపోర్టులన్నీ స్పష్టంగా, సమగ్రంగా ఇచ్చిన విధానం బాగుంది.
హోమియో వైద్యానికి సంబంధించిన అనేక విషయాలను ఈ పుస్తకంలోని 78 వ్యాసాలు తెలియజేస్తాయి. సామాన్య పాఠకులకు కూడా ఉపయోగపడే సూచనలు కూడ వీటిలో ఉన్నాయి.
‘నిశిత పరిశీలనతోనే తగిన మందు’ వ్యాసంలో ‘పల్సటిల్లా’ కేసు ఆసక్తికరంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని రక్షించటానికి, తార్కికంగా ఆలోచించటం ఇందులో కనిపిస్తుంది.
జబ్బు ఒకటే అయినా ఎవరి మందు వారికి, ఎంపిక చేయవలసి ఉంటుందో చెప్తుంది హోమియో వైద్యం. ఈ పుస్తకంలో ఉన్న ఆరు ‘సయాటికా’ కేసులు (పేజి 129 నుండి పేజి 150 వరకు) ఈ సంగతిని నిరూపిస్తాయి. ఒకదానికొకటి పొంతన లేనట్లు కనపడే ఆరు మందులను- కాలీకార్బ్, లైకోపోడియం, సెపియా, స్ట్ఫాసగ్రియా, కోనియం, లేక్‌సిస్- సయాటికాతో బాధపడుతున్న ఆరుగురు వేర్వేరు పేషెంట్లకు ఇచ్చి నయం చేయటం ఈ పేజిలలో చూడవచ్చు.
హోమియో మందులను డాక్టరు చెప్పిన ప్రకారం వేసుకోవాలే తప్ప, విచక్షణా రహితంగా వాడుకోకూడదనే మంచి హెచ్చరిక ‘బెలడోనా-విపరీత ప్రభావాలు’ వ్యాసంలో తెలిపారు. వివరణ బాగుంది.
‘హోమియో మందుపై అపోహలు’ శీర్షికతో పుస్తకంలో రెండు వ్యాసాలున్నాయి. వీటిలో అపోహలను కొన్నిటిని నివృత్తిచేశారు. హోమియోపతి మందు ఎక్కువ చేసి తగ్గిస్తుందని, చాలమంది అనుకుంటారని, అయితే అది నిజంకాదని స్పష్టపరిచారు.
పుస్తకంలోని వ్యాసాలలో అనేకరకాల జబ్బులను గురించి వివరించారు. ఉదాహరణకు కొన్ని- అమీబియాసిస్, కీళ్లనొప్పులు, క్రానిక్ బ్రాంకయిటిస్, డయాబిటిస్. పుస్తకంలోని 78 వ్యాసాలలో ప్రతి దానిలోనూ ఏదో ఒక జబ్బుకు సంబంధించిన విశే్లషణ కనిపిస్తుంది. అవసరమైనచోట మెటీరియా మెడికాలోని అంశాలను కూడ ప్రస్తావించారు. ఈ వివరణలవల్ల ఆయా మందులను మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి వీలవుతున్నది.
పుస్తకంలోని కేసులన్నీ చిత్రమైనవి, లేదా కాంప్లికేటెడ్‌వీ అయి ఉన్నందువల్ల ఆసక్తికరంగా ఉన్నాయి. హోమియోలో డయాగ్నసిస్ అనవసరం అని కొందరు భావిస్తుంటారని, అయితే అది సరికాదని డాక్టరుగారు తెలిపారు (పి.213). అదీగాక, యాగ్జిలరీ ట్రీట్‌మెంటు కూడ ఇవ్వవలసి ఉంటుందని, ఈ ప్రక్రియలవల్ల రోగికి ఉపశమనం కలుగుతుందని అన్నారు. అనుసరించ తగిన ముఖ్యమైన సూచనలు మరికొన్ని కూడ ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

-ఎం.వెంకటేశ్వరశాస్ర్తీ