అక్షర

యువతకు సమాచార నిఘంటువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు
అంతర్జాతీయ జాతీయ,
ప్రాంతీయ విశేషాల
సంకలన సమాహారం
సంకలనం, వ్యాఖ్యానం: చిలువేరు రఘురామ్
9581991129
పేజీలు: 404..
ధర: 250 రూ.
**
చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు వివరించే సంకలనం ఈ పుస్తకం. అన్నీ తెలిసినట్టు అనిపించినా, కొన్ని విషయాలు చదివినపుడు ఆ విషయం తెలీదే అనిపించేలా లోతైన అధ్యయనం చేసి సంకలనం చేసిన గ్రంథం ఇది. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ విశేషాలన్నీ ఇందులో సంకలనం చేశారు. ప్రధానంగా దినోత్సవాలు, జయంతులు, వర్థంతులు, ఆవిష్కరణలు, ముఖ్య ఘట్టాలను చేర్చారు. దీంతో పాటు వ్యక్తులు, ప్రముఖ చారిత్రక సంఘటనలు, నోబెల్ గ్రహీతలు, క్రీడాకారులు, సినీనటులు, రాజకీయ ప్రముఖులు, శాస్తవ్రేత్తల గురించి కూడా ప్రస్తావించారు. సమగ్రతకు కొలమానం లేని అంశాలు ఇవి. ఒక్కోసారి ప్రముఖుల గురించి ఎంత రాసినా తరగదు. రచయితకు ఉన్న పరిమితులు, పరిస్థితులు కారణంగా కొన్ని విషయాలను విస్మరించకతప్పదు. రచయిత చిలువేరు రఘురామ్ చేసిన కృషి భవిష్యత్ తరాలకే కాదు, నేటి యువతకు కూడా సమాచార నిఘంటువుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్కరూ సరదాగా చదువుకోదగిన పుస్తకం ఇది. సంవత్సరం పొడుగూతా ప్రతి రోజు ఏదో ఒక ఘట్టం చరిత్రలో నిక్షిప్తమై ఉంటుంది. ఏ రోజుకారోజు ఈ పుస్తకాన్ని చదువుకుంటూంటే ఆ చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవర్ నిజామాబాద్ జిల్లా కందుకుర్తి గ్రామస్థుడేనని తెలిసినపుడు గాని, ఆంగ్లసంవత్సరాది జరుపుకోవడం వెనుక చరిత్ర, నెలల పేర్లు ఎలా వచ్చాయో కూడా తెలిసినపుడు ఆశ్చర్యం కలుగుతుంది. జీవించి ఉన్న నేతల గురించి కూడా ఇందులో పొందుపరిచారు కనుక ఎప్పటికపుడు వారి గురించి తాజా అంశాలను చేర్చాల్సిన బాధ్యత రచయితపై ఉంది. దీనిని మరింత సమగ్రంగా రూపొందించడం అనేది సవాలుతో కూడుకున్నదే, కారణం ఏ రోజుకారోజు కొత్త సంఘటనలు నిత్యం ప్రపంచవ్యాప్తంగా జరుగుతునే ఉంటాయి. అందులోనూ కీలక విషయాలను తీసుకుని మలి ముద్రణలో చూడగలుగుతారని ఆశిద్దాం. చిత్రాలలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. అస్పష్టత కారణంగా గుర్తించడం కష్టంగా ఉంది.

-బి.వి.ప్రసాద్