అక్షరాలోచన

సహజ సూత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహాలు, సౌర కుటుంబాలు, నక్షత్ర మండలాలు
నెబ్యూలాలు కృష్ణబిలాలు
మనిషి మనసు విశ్వంతో లయమై
కళ్ళెం లేని గుర్రపు డెక్కల చప్పుడులో కలిసిపోయంది
కాలాన్ని పట్టుకునేందుకు విశ్వయత్నం చేసి
మహా విస్ఫోటనం వద్ద కాలాన్ని అధిరోహించాడు
ఏదో శక్తి
అదే గురుత్వాకర్షణ తరంగ శక్తి
ఆకర్షణ వికర్షణల వైరుధ్య శక్తి
సౌర కుటుంబాన్ని ఒకే కుటుంబంగా నిలబెడుతోంది
ఏదో బంధం
అదే ఆత్మీయతానుబంధం
ప్రేమ ద్వేషాల సమన్వయం
మానవ కుటుంబానికి ఏకసూత్రమై
వసుధైక కుటుంబాన్ని ఆవిష్కరిస్తోంది
మానవ అస్తిత్వానికి తొలి వెలుతురు
భూగోళంపై సముద్రంలో ఏక కణ రూపమై వెలసింది
పంచ భూతాల లయలో
ఏక కణం బహు కణమై
ప్రోటోప్లాజం నుంచి ప్రాణ స్పందన పొందింది
లతలు తరులు సరీసృపాలు సూక్ష్మ స్థూల జీవులు
బహుముఖాలుగా జీవం విస్తరించింది
జీవకోటి ఇతిహాసంలో
హోమోసెపియన్ నిలుచున్నాడు మానవుడై
ప్రకృతిలో తనను తాను చూసుకుంటూ
తన మస్తిష్కంలో జరిగే కల్లోలాలను
ఒడిసి పట్టుకునేందుకు
ఎన్నో ఎనె్నన్నో విన్యాసాలు చేశాడు
ప్రకృతిలో విలీనమవుతూ
సరిగమల గమకాలలో కవితాగానం చేశాడు
చిత్రానుభూతుల స్పందనలను చిత్రంలో బంధించాడు
ప్రకృతితో అలీనవౌతూ
అదుపు సాధిస్తూ ఎదిగాడు మృత్యుంజయుడై
ఒక్కోసారి అదుపు కోల్పోయ దిగంతాల కావల నిలబడి అర్థిస్తున్నాడు మహాశక్తికై
చక్రం మానవ పురోగమన చరిత్రలో ఒక మైలురాయ
కదలిక జీవకోటికి ప్రాణప్రదం
చక్రం తిప్పిన మనిషి
జగతిని మరో మలుపు తిప్పేందుకు
కేంద్రకాన్ని బద్దలుకొట్టాడు
ఎలక్ట్రాన్ ప్రోటానుల విన్యాసంలో
పరస్పర వైరుధ్యంలో తన్ను తాను ఆవిష్కరించుకున్నాడు
తన గతికి పురోగతికి
మూలం మార్పేనని రూఢీపరుచుకున్నాడు
మార్పు సార్వజనీనం
ఒక సార్వత్రిక సత్యం
కొత్తగా చిగురించే పుష్పం
కాల సూత్రానికి కట్టుబడి ఫలంగా మారుతూ వుంటుంది
ఫలం తనను తాను సమర్పించుకుని
మరో వృక్షంగా మారి ఫల పుష్పాదులను జగతికందిస్తుంది
పంచభూతాలు అంతస్సూత్రమై
కాల సూత్రానికి అనుబంధమై ప్రపంచాన్ని అలరిస్తాయ
మనిషి మనుగడ గతి తార్కిక సూత్రానికి నిబద్ధమై
నిత్యనూతనంగా భాసిస్తోంది
ప్రకృతి నిరంతరం మారుతూ
విశ్వ యవనికపై కొత్త దృశ్యాలను చూపుతుంది
మనిషి మాత్రం గతాన్ని మరువలేక
భవిష్యత్తును పట్టుకునేందుకు పరిభ్రమిస్తున్నాడు
తన చుట్టూ తాను ఒక శకలంగా -

- పిళ్లా కుమారస్వామి రెడ్డి, 8106432949