సాహితి

చివరాఖరికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరం వెళ్ళిపోవాలి
బ్రతుకు కలవరాలన్నింటికీ వీడ్కోలు పలికి
సన్నిహితంగా మెలిగిన జ్ఞాపకాల్ని ఓదార్చుకుని
మట్టి పూతలతో నిండిపోయిన కలలు
మృత్యువు తలుపు తట్టి నిల్చున్నాక
ఒక పరిపూర్ణ వేదన అంతమవుతుంది
ఎక్కడనుంచి వచ్చావు?
తొమ్మిది గుమ్మాల గూడు ధ్వంసమవుతుంది
నీలో ఏదీ నీకోసం మిగలదు కదా
భయాలు కూలిపోయాయి
బొడ్డు పేగు మట్టిలోంచి మరలా మొల్చి
నిన్ను ఆప్యాయంగా చుట్టుకుంటుంది

ఎలా గడిచిపోయాయో... వేల రాత్రుళ్ళు
ఆనంద ధారల క్షణాలలో తడిసి
పగటి మేఘాలతో కల్సి కరిగి ప్రవహించి
ఇన్నాళ్ళూ జన్మని జోకొట్టుకుంటూ కదిలావు
చివరికి రిక్తహస్తాలతో మిగిలావు
దేన్నీ అనువదించుకోలేక పోయావు
బంధించబడ్డ దేహంలోంచి చివరాఖరికి
శాశ్వతంగా విడుదలయి పోతావు
ఇంకా ఈ గడపని పట్టుకు వేలాడతావా?
మరింకేదో అనుభవించలేదని బాధపడ్తున్నావా?
తెగిన తీగల్ని మరలా పెనవేయడం కుదరదు
బ్రతుకు ఎన్నటికీ పూర్తికాని కవిత

మరణించాక గర్భచర్యల్ని ఓదార్చుకోవాలి
ఊపిరుల్ని ఆపేసి
మట్టి దండల్ని ధరించాలి
భయమెందుకు?... ... ఏదో ఒక రోజున
కాలం తలుపుల్ని మూయక తప్పదు
దేహం తన దీపాన్ని ఆర్పకా మానదు

అందరం వెళ్ళిపోవాలి
శాశ్వత నిద్ర పరీమళాల్ని పీల్చి
మాటల్ని కంఠాలలోనే పూడ్చి
ఒకే భంగిమలో శయనించాలి
దుఃఖపోతల్ని కప్పుకున్న బ్రతుకుని కూల్చుకుని
నిర్భయంగా కదలాలి...
అందరం వెళ్ళిపోవాలి...

- ఖాదర్ షరీఫ్, 9441938140