అక్షర

అక్కరకొచ్చే అద్భుత రచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటరాని దైవం
అనువాద కథలు
నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, హైదరాబాద్
పేజీలు 225+
వెల: రు.160/-
**

ఈ పుస్తకంలో వివిధ భారతీయ భాషలలోని అనువాదాలున్నాయి. భారతీయ రచయితలు ఇంగ్లీషులో రాసిన కథల అనువాదాలు కూడా ఉన్నాయి. రష్యన్, అమెరికన్, జపనీస్ కథలు కూడా ఉన్నాయి. కమలాదాస్, కుష్వంత్‌సింగ్, గ్రాహంగ్రీన్, కువెంపు, సబిరేత్‌రాయ్ మురకామి వంటి లబ్ధప్రతిష్ఠులున్నారు. చెకోవ్ కథ కూడా ఒకటి చివరిలో వుంది. మిగతా రచయితలు కూడా గొప్పవారే. పుస్తకం చివరిలో రచయితల పరిచయాలున్నాయి. కనుక పాఠకులకు మరింత సమాచారం అందుతుంది.
ఇవేవీ ఆషామాషీ కథలు కావు. తెలుగు పాఠకులకు కొత్తదనాన్ని అందించాలని నిజాయితీతో ఎంపిక చేసినవి అవి. అనువాదకుడు ముందే హెచ్చరించాడు. ఇందులో మూడు తప్ప(మినహా) మిగతా మొత్తం కథలు విపుల పత్రికలో వచ్చినవి. మనసుగల విమర్శకులు విహారి, బంగారికి తావి అని మెచ్చేసుకున్నారు. మూల కథలోని నేటివిటీని పట్టుకున్నారని కూడా ఆయన అన్నారు.
కథలు ఏ కొంచెం ఆసక్తిగలవారినైనా చదివిస్తాయి. అట్లాగని పుస్తకం మొత్తం ఒక్క ఊపులో చదవాలని ఎక్కడా లేదు. ఈ మధ్యన అనువాద సాహిత్యం బాగా వస్తున్నట్టు కనపడుతుంది. మిగతా భాషలు, ప్రాంతాల వారి భావజాలం పరిచయం కావడానికి ఈ పుస్తకాలు సాయం చేస్తాయి.
పాత్రికేయులు పార్ధసారధి మరిన్ని రచనలు అందిస్తారేమో చూడాలి.

-కె.బి.గోపాలం