అక్షర

బాలల మనసును పట్టే గేయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెన్నముద్దలు’
బాలగేయాల సంపుటి డా.పత్తిపాక మోహన్
వెల: రూ.60/-
‘గంగా పబ్లికేషన్స్, 5-4-47, పత్తిపాక స్ట్రీట్, సిరిసిల్ల- 505301.
అన్ని పుస్తక కేంద్రాలలోనూ
**
విద్యాధికుడు, కవి, రచయిత, విమర్శకుడు, బాల సాహితీవేత్త, ఇలా బహువిధాలుగా ప్రసిద్ధిగాంచిన డా.పత్తిపాక మోహన్ కలంనుండి జాలువారిన మరో గ్రంథం, బాలగేయాల సంపుటి ‘వెన్నముద్దలు’. ఇవి నిజంగా వెన్నముద్దలే. కమ్మని సువాసనా, కమనీయమైన రుచి కలిగిన వెన్న ముద్దల్లాగే, పోయినా చదివిస్తాయి ఈ గేయాలు. పిల్లలు వారికి తెలిసిన కొన్ని రంగాల్లోనూ మరిన్ని వేరుగానూ ఆడుకుంటూ పాడుకునే గేయాలివి.
‘అమ్మ మనసు చల్లన’/ నాన్న చేయి లాలన’- అంటూ ప్రారంభించిన గేయం, ‘పూలదండ’లో,
‘మా తాత ఒచ్చిండు/ నాకొక బొమ్మ తెచ్చిండు
బొమ్మ నాకు దోస్తట/ పొడవుగ దాని జుట్టంట’ అంటూ సాగుతుంది ఈ గేయం.
‘అమ్మ అమ్మా రావమ్మా/ నాకూ అన్నం పెట్టమ్మా
కాళ్లూ ముఖం కడిగాను/ సబ్బుతో చేతులు రుద్దాను
త్వరగా వచ్చి వడ్డించు/ బడికిపోయి నే చదివేస్తా’-అంటూ ఆడపిల్ల ‘నాకూ’ అని అనడంలో అన్నయ్యతో సమానంగా అనే అర్థం వస్తుంది. కాళ్లూచేతులు కడుక్కున్నా అని చెప్పడంలో శుభ్రత గురించి చెప్పడం ఈ గేయంలో విశేషం.
ఇలా చక్కటి అర్థం, భావం వివరిస్తూ పాడుకోవడానికి అనువుగా సరళమైన భాషలో వున్నాయి ఈ గ్రంథంలోని అన్ని గేయాలు. మచ్చుకి మాత్రం రెండుమూడు వినిపించాను.
చివరగా దేశభక్తిని చాటుతూ మన జెండా వివరాలతో‘‘మూడు రంగులది మన జెండా
ముచ్చటయినదీ ఈ జెండా’ అనే గేయంతో ముగిస్తాడు కవి. చెప్పదల్చుకున్నది స్పష్టంగా రచించిన గేయాలివి. ఇప్పటికీ ఎన్నో గ్రంథ రచనలు చేసి, వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా అందరికీ సుపరిచితులైన డా.పత్తిపాక మోహన్ కలంనుండి మరిన్ని గ్రంథాలు పూస్తాయని ఆశిద్దాం.

-శారదా అశోకవర్ధన్