అక్షర

అనువాద కథల హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథాభారతి
(అనువాద కథలు)
ఆర్.శాంత సుందరి
వెల:రూ.140/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
హిందీతోపాటు మరికొన్ని ప్రాంతీయ భాషలలో వెలువడిన 19 మంచి కథలతో కథాభారతి సంకలనం ప్రచురించారు. అనువాద కళలో ఆరితేరిన ఆర్.శాంతసుందరి, ఈ కథలను చక్కగా అనువదించారు. వివిధ ప్రాంతాల ప్రజల ఆలోచనలనూ, జీవన విధానాలనూ ఈ కథలు ప్రతిబింబిస్తాయి.
1984లో భోపాల్ నగరంలో జరిగిన గ్యాస్ లీకేజివల్ల, వేలకొద్దీ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతిని వివరించే అద్భుతమైన కథ ‘ట్రాజెడీ... మై ఫుట్’. విదేశాలకు చెందిన యూనియన్ కార్బయిడ్ కంపెనీలో జరిగిన ఈ దుర్ఘటనలో శరీర భాగాలు దెబ్బతిని అవిటివాళ్లుగా మారినవాళ్లూ వేల సంఖ్యలో ఉన్నారు. ఈ ఘోర కలికి బాధ్యులెవరు? అని ప్రశ్నిస్తుంది ఈ కథ. మన రాష్ట్రాలన్నీ ఒకరిని మించి మరొకరు, ‘ఇక్కడికి వచ్చి మీ ఫాక్టరీలు పెట్టుకోండ’ని విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ కథ ఎత్తిచూపిస్తున్న అంశాలు ఆలోచించతగ్గవి.
కొడుకులిద్దరినీ పెంచి ప్రయోజకులను చేయటానికి జీవిత కాలమంతా కష్టపడ్డ బంగీబాబాకు వార్ధక్య దశలో కష్టాలు మొదలయ్యాయి. కొడుకుల మీద ఆధారపడి బతకవలసి రావటంతో అతడు మనసులో పడ్డ క్షోభను ఆవిష్కరించే మంచి కథ ‘ఓడమీద ఒంటరి పక్షి.’
‘జ్యోతి విశ్వనాథ్’ కథలో స్ర్తివాదం అనే అంశం ప్రాతిపదికగా కనిపిస్తుంది. అయితే కథ ముగింపులో పరిస్థితులకు రాజీపడటం చిత్రంగా తోస్తుంది.
ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు, రిజర్వాయర్ కింద నీళ్లలో మునిగిన ఒక ఊరి కథ ‘ముంపు’. ఒక చిన్న దొనె్నలో ప్రయాణం చేస్తూ, నీటి అడుగున ఉన్న తమ ఊరి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్న ఇద్దరు పిల్లలు ఇందులో కనిపిస్తారు. కథ సహజత్వానికి బాగా దగ్గరగా ఉంది.
ప్రతివారిలోనూ వయసు తెచ్చే మార్పు స్వాభావికంగానే జరిగిపోతుందనే సంగతిని ‘ఎన్‌కౌంటర్’ కథ ఆసక్తికరంగా తెలుపుతుంది.
జాత్యహంకారం వల్ల కావచ్చు, లేదా వర్గ పోరాటాలవల్ల కావచ్చు- ఏదయితేనేం, ప్రపంచంలో ఏదో ఒకచోట, అమాయక ప్రజలు కట్టుబట్టలతో దేశం వదిలి పారిపోవటం జరుగుతూనే ఉంది. ప్రాణభయంతో పారిపోయే ప్రజల బతుకును ‘శరణాగతులు’ (కాందిశీకులు) వివరిస్తుంది.
‘అవతలి గట్టు’ కథలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. పల్లెటూళ్లో ఒంటరిగా ఉన్న ముసలావిడ తన అవసరాలకోసం ఒక సేవకురాలిని ఏర్పాటు చేసుకుంటుంది. పట్నంలో ఉన్న కోడలికి ఈ పిల్ల తనదగ్గర ఉంటే బాగుంటుందని కోరిక కలిగింది. ఆ పనిమీద భర్తను గ్రామానికి పంపింది. తనకు కష్టాలు ఎక్కువవుతాయని తెలిసి కూడా, పనిపిల్లను పట్నానికి పంపటానికి తల్లి ఒప్పుకుంటుంది. కథలో మనస్తత్వాల విశే్లషణ బాగుంది.
పుస్తకంలోని కథల మూల కథారచయితల వివరాలను పుస్తకం చివరలో ఇచ్చారు. వీరందరూ పేరుప్రఖ్యాతులున్నవారే. కథలన్నీ బాగున్నాయి.

-ఎం.వెంకటేశ్వరశాస్ర్తీ